చెప్పుతో కొట్టినట్టు చెప్పినా సిగ్గు లేదా..
గోబెల్స్ ప్రచారాన్ని మంత్రి రోజా సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టారు. చెప్పుతో కొట్టినట్టు చెప్పినా మీకు సిగ్గులేదా అంటూ లోకేష్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
సచివాలయం తాకట్టు అనే తప్పుడు వార్తతో రెండురోజులుగా ఎల్లో మీడియా హోరెత్తిపోతోంది. ఆ అబద్ధాని పదే పదే చెబుతూ నిజం అని ప్రజలు భ్రమించేలా ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వ వ్యవస్థలు వివరణ ఇచ్చినా, ఆఖరుకి తనఖా పెట్టుకున్నారన్న బ్యాంకు యాజమాన్యం వివరణ ఇచ్చినా కూడా చంద్రబాబు, లోకేష్ మాత్రం తమ ప్రయత్నాలు మానలేదు. ఈ గోబెల్స్ ప్రచారాన్ని మంత్రి రోజా సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టారు. చెప్పుతో కొట్టినట్టు చెప్పినా మీకు సిగ్గులేదా అంటూ లోకేష్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు రోజా.
"ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం మీ నాన్న రాజకీయం. మీరు చేస్తున్నది అసత్య ప్రచారమని HDFC బ్యాంక్ వాళ్లు చెప్పుతో కొట్టినట్టు చెప్పినా... సిగ్గు లేకుండా ఇంకా ఇంకా విషం చిమ్ముతున్నావు. మా ఆంధ్రప్రదేశ్ ప్రజల జాగ్రత్తలు మా జగన్ అన్న చూసుకుంటారు. 2 నెలల తర్వాత మీ నాన్ లోకల్ నాయకులంతా ఎక్కడ ఉండాలో ఆలోచించుకోండి." అంటూ లోకేష్ ని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ వేశారు రోజా.
ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం మీ నాన్న @ncbn రాజకీయం!! మీరు చేస్తున్నది అపద్దపు ప్రచారమని @HDFCBank_Cares సంస్థ చెప్పుతో కొట్టినట్టు చెప్పినా... పరిజ్ఞానం లేని నీ తప్పుడు పోస్టులు పెట్టి అబాసుపాలైనా సిగ్గు లేకుండా ఇంకా ఇంకా విషం చిమ్ముతున్నావు @naralokesh మా… https://t.co/yfzGujQb2X
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 5, 2024
ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ ఎల్లో మీడియా బరితెగించి పోతోంది. రోజుకో తప్పుడు వార్తతో రెచ్చిపోతోంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పోటీ పడి మరీ ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. అలా ఆ వార్తలు రావడం, ఆ తర్వాత వెంటనే టీడీపీ నేతలు వాటిని చూపిస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా బహిరంగ సభల్లో ఆ వార్తల్నే చదివి వినిపించడం.. ఇలా ఉంది ఈ వ్యవహారం. ఎన్నికల వేళ ఈ తప్పుడు వార్తల్ని వైసీపీ అనుకూల మీడియా ఖండిస్తున్నా.. అసలు నిజాలు ప్రజల ముందుకు తెస్తూన్నా ఎక్కడో ఓ చోట అది నిజం అని భ్రమించేవాళ్లు కూడా ఉన్నారు. వారికోసమే వైసీపీ నాయకులు పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. వైరి వర్గానికి ఘాటుగా బదులివ్వాల్సి వస్తోంది.