Telugu Global
Andhra Pradesh

చంద్రబాబులో ఓటమి భయం కనిపిస్తోంది.. - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాష్ట్రంలోని 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ గెలవడం ఖాయమని, రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు.

చంద్రబాబులో ఓటమి భయం కనిపిస్తోంది.. - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
X

చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే పొత్తుల కోసం ఢిల్లీలో వెంపర్లాడాడని విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. ఇప్పటికే నిర్వహించిన మూడు ’సిద్ధం’ సభలు సూపర్‌ సక్సెస్‌ కావడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.

త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనం ఖాయమని మంత్రి తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ గెలవడం ఖాయమని, రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఇవన్నీ అర్థం కావడం వల్లే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడాడని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు భారీ సంఖ్యలో హాజరైన జనంతో విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. ఆదివారం బాపట్ల జిల్లా మేద‌ర‌మెట్ల‌లో జరిగే ‘సిద్ధం’ సభ కూడా దద్దరిల్లిపోయేలా ఉంటుందని మంత్రి చెప్పారు.

First Published:  10 March 2024 5:23 AM
Next Story