లోకేష్ వి అర్ధనగ్న ఫొటోలున్నాయి.. వాటి సంగతేంటి..?
మార్ఫింగ్ చేశారా, లేదా అని తెలుసుకోవడానికి గంట సమయం సరిపోతుందంటూ పచ్చదండు చెప్పడం హాస్యాస్పదం అన్నారు నాగార్జున. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు గొంతుని నిర్ధారించే విషయం ఇప్పటి వరకూ ఎందుకు తేలలేదన్నారు.
గోరంట్ల మాధవ్ కు వైసీపీ నుంచి క్రమంగా మద్దతు పెరుగుతుందా, ఉద్దేశ పూర్వకంగానే టీడీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటున్నారా..? ప్రస్తుత పరిస్థితి చూస్తే అలానే ఉంది. ఇప్పటికే మంత్రి రోజా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాధవ్ కు మద్దతిచ్చినట్టు మాట్లాడగా.. తాజాగా మంత్రి మేరుగ నాగార్జున నేరుగా మాధవ్ కి మద్దతు తెలిపారు. బీసీ, ఎస్సీలను అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు నాగార్జున.
టీడీపీపై ఆరోపణలు..
ఎంపీ గోరంట్ల మాధవ్ పై చంద్రబాబు, టీడీపీ నాయకులు విషం వెళ్ళగక్కుతున్నారని మండిపడ్డారు మేరుగ నాగార్జున. తన వీడియోలను మార్ఫింగ్ చేశారంటూ స్వయంగా బాధితుడు మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. మార్ఫింగ్ చేశారా, లేదా అని తెలుసుకోవడానికి గంట సమయం సరిపోతుందంటూ పచ్చదండు చెప్పడం హాస్యాస్పదం అన్నారు నాగార్జున. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు గొంతుని నిర్ధారించే విషయం ఇప్పటి వరకూ ఎందుకు తేలలేదన్నారు. బ్రీఫ్డ్ మీ కేసులో హైదరాబాద్ లో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు చంద్రబాబు నీతులు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
లోకేష్ సంగతేంటి..?
గతంలో లోకేష్ అమ్మాయిలతో బీచ్ లో అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయని, అది సమ్మతమేనా అని ప్రశ్నించారు మంత్రి మేరుగ నాగార్జున. పరోక్షంగా మాధవ్ కి బీసీల మద్దతు ఉందని చెప్పారు మంత్రి. అదే సమయంలో టీడీపీ కుట్ర చేసిందంటూ చెప్పుకొచ్చారు. మాధవ్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి, ఆయన ఈ విషయంలో బాధితుడని, నిజా నిజాలు పోలీస్ విచారణలో నిగ్గు తేలతాయని చెప్పారు. అయితే పోలీస్ విచారణలో గోరంట్ల మాధవ్ తప్పు చేశారని తేలితే చర్యలు కఠినంగా ఉంటాయని ముక్తాయించారు.