ఈసారి కూడా అసెంబ్లీ గేట్ దాటలేవు
యుద్ధంలో అస్త్రసన్యాసం చేసిన వ్యక్తి పవన్ అన్నారు జోగి రమేశ్. ముఖ్యమంత్రి అవుతానని పార్టీ పెట్టి, సీట్లకు లొంగిపోయాడని విమర్శించారు.
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేశ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపడుతూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఎక్కడ పోటీచేయాలో కూడా తెలియని పవన్.. అసెంబ్లీ గేటుకూడా దాటలేడని విమర్శించారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, పవన్‌లో ఇంకా ఓటమి భయం పోలేదన్నారు. ఎన్నికల తరువాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయమన్నారు.
యుద్ధంలో అస్త్రసన్యాసం చేసిన వ్యక్తి పవన్ అన్నారు జోగి రమేశ్. ముఖ్యమంత్రి అవుతానని పార్టీ పెట్టి, సీట్లకు లొంగిపోయాడని విమర్శించారు. 2014లోనూ 3 పార్టీలు ఏకమై వచ్చి తరువాత కొద్ది నెలలకే వీడిపోయాయాన్నారు. ఈ ఎన్నికల్లోనూ కూటమికి ఓటమి ఖాయమని జోగి జోస్యం చెప్పారు. చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారన్నారు. 175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు జోగి రమేశ్.