పొత్తుల్లేకుండా బరిలో దిగితే.. వలంటీర్‌ని పెట్టి ఓడిస్తాం.. - పవన్‌కి మంత్రి జోగి రమేష్ సవాల్
తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో నిలిస్తే వలంటీర్‌ను అభ్యర్థిగా పెట్టి పవన్‌ను ఓడిస్తామన్నారు. పవన్‌తో పోటీకి తాను, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్కర్లేదని తెలిపారు.
ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో నిలిస్తే వలంటీర్‌ను అభ్యర్థిగా పెట్టి పవన్‌ను ఓడిస్తామన్నారు. పవన్‌తో పోటీకి తాను, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్కర్లేదని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తొడలు కొట్టి, మీసం మెలేసి మాట్లాడే పవన్ కళ్యాణ్‌కి దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు మంత్రి జోగి రమేష్. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి స్థానికంగా ఉండేవారిని వలంటీర్లుగా నియమిస్తే.. వారిని కించపరిచేలా మాట్లాడటం, అరాచక శక్తులుగా, ఆడపిల్లలను అపహరించేవారిగా పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు చేయడం ఆయన వైఖరికి అద్దం పడుతోందని మంత్రి చెప్పారు.
వ్యవస్థలను ధ్వంసం చేసిన ఘనత చంద్రబాబుదేనని జోగి రమేష్ విమర్శించారు. అన్ని పార్టీలూ కలిసి పొత్తులు పెట్టుకున్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మళ్లీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగనే మళ్లీ సీఎం అవుతారని తేల్చి చెప్పారు.