Telugu Global
Andhra Pradesh

బాబు, అచ్చెన్నకు మంత్రి జోగి రమేష్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌

నేడు రాష్ట్రంలోని ప్రతి పేదవాడూ సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారని మంత్రి చెప్పారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి ప్రతి హామీనీ అమలు చేశామన్నారు.

బాబు, అచ్చెన్నకు మంత్రి జోగి రమేష్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌
X

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. వారికి ధైర్యం ఉంటే వారి మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చారనేది చెప్పాలన్నారు. దీనిపై తాము ఎప్పుడైనా.. ఎక్కడైనా చర్చకు రెడీ అని జోగి రమేష్‌ సవాల్‌ చేశారు. తాడేపల్లిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చినట్టు మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. అందుకే ఎమ్మెల్యేలంతా ధైర్యంగా నేడు గ్రామాల్లో ప్రతి గడపకూ వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన మేలును గత ఏడాది కాలంగా ప్రజలకు వివరించగలుగుతున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన ఏకైక పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. అయినా.. తమ పార్టీ హామీల అమలులో 85 శాతం ఫెయిల్‌ అంటున్న టీడీపీ నేతలకు ఓపెన్‌ ఛాలెంజ్‌ చేస్తున్నానని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు.

నేడు రాష్ట్రంలోని ప్రతి పేదవాడూ సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారని మంత్రి చెప్పారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి ప్రతి హామీనీ అమలు చేశామన్నారు. అందుకే ధైర్యంగా జనాల్లోకి వెళుతున్నామని చెప్పారు. టీడీపీ నేతలు మాత్రం వారి మ్యానిఫెస్టోని చెత్త బుట్టలో పడేసి, పార్టీ వెబ్‌సైట్‌ నుంచి కూడా తొలగించేశారని ఎద్దేవా చేశారు.

First Published:  28 Dec 2023 6:54 PM GMT
Next Story