సీటివ్వలేదని ఇంట్లో కూర్చోం.. పార్టీ జెండా మోస్తాం..
ప్రస్తుతం పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారని, ఇంకా మరికొన్ని చోట్ల నియమించే అవకాశముందని, అయితే.. బీఫామ్ ఇచ్చేవరకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనేది నిర్ధారణ కాదన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల కోసం అవసరం అనుకుంటే ఏ నియోజకవర్గంలోనైనా ఎవరినైనా మార్చవచ్చని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ఒకవేళ సీటు ఇవ్వకపోతే.. సీటివ్వలేదని తాము ఇంట్లో కూర్చోబోమని, పార్టీ జెండా మోస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్ మాట్లాడారు.
రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల కంటే 5 కోట్ల మంది ప్రజల సంక్షేమమే సీఎం జగన్‌కు ముఖ్యమని మంత్రి చెప్పారు. ప్రజల సంక్షేమం, వారి కుటుంబ ఆర్థికాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి ఆయా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారని, ఇంకా మరికొన్ని చోట్ల నియమించే అవకాశముందని, అయితే.. బీఫామ్ ఇచ్చేవరకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనేది నిర్ధారణ కాదని ఆయన తెలిపారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడంపై మంత్రి అమర్ స్పందిస్తూ ఆయన ఒక ఈవెంట్ మేనేజర్ అని చెప్పారు.