జనసేనే కాదు మరో 5 పార్టీలు కలిసినా.. గెలిచేది వైసీపీనే
టీడీపీ, జనసేనే కాదు మరో 5 పార్టీలు కలిసినా తమకొచ్చే నష్టమేమీ లేదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా.. తమ పొత్తు మాత్రం జనంతోనే అని మంత్రి బొత్స చెప్పారు.
BY Telugu Global1 Oct 2023 9:04 AM IST

X
Telugu Global Updated On: 1 Oct 2023 9:04 AM IST
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఆ రెండు పార్టీలు ఇప్పుడు కొత్తగా కలవలేదని, ముందునుంచీ అవి రెండూ ఒకటిగానే కొనసాగుతున్నాయని తెలిపారు. విజయనగరంలో శనివారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేనే కాదు మరో 5 పార్టీలు కలిసినా తమకొచ్చే నష్టమేమీ లేదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా.. తమ పొత్తు మాత్రం జనంతోనే అని మంత్రి బొత్స చెప్పారు.
ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీపీఎస్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించేందుకు అవకాశం ఉందని వివరించారు.
Next Story