Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఓటమికి అదే సంకేతం - బొత్స

తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీనేనన్నారు మంత్రి బొత్స. 175 స్థానాలకు దగ్గరగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని 34 స్థానాలకు 34 వైసీపీ గెలుచుకోబోతుందన్నారు.

టీడీపీ ఓటమికి అదే సంకేతం - బొత్స
X

పోలింగ్‌ తర్వాత చెలరేగిన హింస విషయంలో అనవసరంగా వైసీపీపై నిందలు వేయడం సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నేతల ఫిర్యాదుతో ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస చెలరేగిందన్నారు. అధికారుల బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసుకోకుండా మార్పులు, చేర్పులు జరిగాయన్నారు. ఫ్రస్ట్రేషన్‌తోనే టీడీపీ నేతలు దాడులు చేశారన్నారు బొత్స.

తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీనేనన్నారు మంత్రి బొత్స. 175 స్థానాలకు దగ్గరగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని 34 స్థానాలకు 34 వైసీపీ గెలుచుకోబోతుందన్నారు. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. మహానాడును వాయిదా వేసుకోవడమే టీడీపీ ఓటమికి సంకేతమన్నారు బొత్స.

ప్రతిపక్ష పార్టీలు కక్షపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు మంత్రి బొత్స. హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించొద్దని ప్రతిపక్షాలను కోరారు.

First Published:  17 May 2024 5:10 PM IST
Next Story