Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై క్లారిటీ.. అది అందరికీ వర్తించదు!

AP Outsourcing Employees: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఉన్న గందరగోళం అంతా కావాలని చేస్తున్న దుష్ఫ్రచారం అని చెప్పారు. ప్రభుత్వంపై కావాలనే ఇలాంటి ఆరోపణలు మోపుతున్నారని బొత్స చెప్పుకొచ్చారు.

AP Outsourcing Employees
X

ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై క్లారిటీ.. అది అందరికీ వర్తించదు!

ఏపీ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తల వస్తున్నాయి. తాత్కలిక ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం వదిలించుకుంటున్నట్లు కొన్ని వర్గాల మీడియా హైలైట్ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఉన్న గందరగోళం అంతా కావాలని చేస్తున్న దుష్ఫ్రచారం అని చెప్పారు. ప్రభుత్వంపై కావాలనే ఇలాంటి ఆరోపణలు మోపుతున్నారని బొత్స చెప్పుకొచ్చారు.

వైసీసీ పార్టీ గతంలో ఎవరికీ రాని మెజార్టీని తెచ్చుకొని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్ని వర్గాలకు మంచి పాలన ఇవ్వాలని సీఎం జగన్ కష్టపడుతున్నారు. ప్రభుత్వం అంతా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోంది. తాజాగా ప్రభుత్వం తరపున ఒక జీవో విడుదల అయ్యింది. అది కొన్ని శాఖల్లో పని లేకుండా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంతే కాని రాష్ట్రంలో ఉన్న అందరికీ దానితో సంబంధం లేదు. దీనిపై అనవసరమైన దుష్ప్రచారం చెయ్యొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఆ ఉద్యోగులను తొలగిస్తున్నామన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. అలాంటి ఆలోచన అసలు ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రభుత్వంలోని ఏవైనా శాఖలు తమ పరిధిలో ఎవరినైనా తొలగించి ఉంటే తప్ప.. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినీ తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో జరిగిన స్కామ్‌లో సెంట్రల్ ఏజెన్సీ దర్యాప్తు జరుగుతున్నదని.. అందులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సజ్జల చెప్పారు. దానికి సంబంధించి అన్ని విషయాలు ఈడీ చూసుకుంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు.

First Published:  5 Dec 2022 3:33 PM IST
Next Story