లేని యాక్ట్ ని తొలగించడమేంటి..?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సలహాలు, సూచనలు ఇచ్చిందని, ఇంకా యాక్ట్ అమలులోకి రాలేదని, లేని యాక్ట్‌ను తొలగిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అన్నారు బొత్స.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేకపోయి ఉంటే ఆ తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకుని ఉండేవాళ్లమని హెచ్చరించారాయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సలహాలు, సూచనలు ఇచ్చిందని, ఇంకా యాక్ట్ అమలులోకి రాలేదని, లేని యాక్ట్‌ను తొలగిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అన్నారు బొత్స.
ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. స్వయానా సీఎం జగన్ కూడా దీనిపై స్పందించారు. తాను భూములు ఇచ్చేవాడినే కానీ లొక్కొనే వాడిని కాదన్నారు. అయినా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చెబుతున్నదే నిజం అని భ్రమ కల్పించేలా ఎల్లో మీడియా తనవంతు విషప్రచారం మొదలు పెట్టింది. దీనిపై ప్రభుత్వం మండిపడుతోంది. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందని చెప్పారాయన.
ల్యాండి టైటిలింగ్ యాక్ట్ మెమోలో ఉన్నది ఒకటైతే ప్రతిపక్షాలు ప్రచారం చేస్తోంది మరొకటి అని అన్నారు మంత్రి బొత్స. ఈ-సైన్ ద్వారా, ఆధార్ అథెంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు. దళారీ వ్యవస్థ ఉండకూడదనే ఈ యాక్ట్ తెస్తున్నామని అన్నారు. భూమి పేపర్లకు బదులు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిరాక్స్ పేపర్లు ఎవరైనా ఇచ్చి సరిపెడతారా అని ప్రశ్నించారు బొత్స. ఈ యాక్ట్ ని అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ.. క్రిమినల్స్‌లాగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచన అని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మూడు సార్లు అసెంబ్లీలో చర్చ జరిగిందని వివరించారు మంత్రి బొత్స.