అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. అంబటి వెటకారం
శ్యాంబాబు పాత్రతో పవన్ కల్యాణ్ తనను గోకాడని, తన పాత్రను తిట్టి శునకానందం పొందారని అంటున్న అంబటి.. ఇప్పుడు రేణు దేశాయ్ ని కూడా అదే కోరారు. అయితే, మీ మాజీకి చెప్పు అంటూ మళ్లీ పవన్ వివాహాల వ్యవహారాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్టయింది.
ఎవ్వరూ తగ్గట్లేదు, పోనీలే అని సరిపెట్టుకోవడంలేదు. బ్రో సినిమా వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రులు, మాజీ మంత్రులు, అసలు అధికార పార్టీ మొత్తం ఇప్పుడు బ్రో, తదనంతర పరిణామాలపై దృష్టిపెట్టింది. అటు జనసేన, మెగా ఫ్యాన్స్ కూడా తాడోపేడో తేల్చుకుందామనుకుంటున్నారు. మధ్యలో రేణు దేశాయ్ వేసిన ట్వీట్ ఇప్పుడు మరో కొత్త చర్చకు దారి తీసింది. రేణు ట్వీట్ కి అంబటి ఇచ్చిన రియాక్షన్ మరింత సంచలనంగా మారింది.
అంబటి ఏమన్నారు..?
"అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు..
మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!"
ఇదీ అంబటి వేసిన ట్వీట్. ఇక్కడ మాజీ అని నొక్కి మరీ చెప్పడం ఆయన వెటకారాన్ని గుర్తు చేస్తోంది. శ్యాంబాబు పాత్రతో పవన్ కల్యాణ్ తనను గోకాడని, తన పాత్రను తిట్టి శునకానందం పొందారని అంటున్న అంబటి.. ఇప్పుడు రేణు దేశాయ్ ని కూడా అదే కోరారు. అయితే మీ మాజీకి చెప్పు అంటూ మళ్లీ పవన్ వివాహాల వ్యవహారాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్టయింది.
అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు
— Ambati Rambabu (@AmbatiRambabu) August 10, 2023
మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !
పవన్ మూడు పెళ్లిళ్లపై దయచేసి చర్చ ఆపండి అంటూ రేణూ దేశాయ్ ఇన్ స్టా లో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన పిల్లల్ని, మిగిలిన పిల్లల్ని కూడా ఈ వ్యవహారంలోకి లాగవద్దన్నారామె. బ్రో సినిమాలో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయని తనకు తెలిసిందని, అయితే.. దానిపై తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పారు. ఇటీవల కొంతమంది పవన్ మూడు పెళ్లిళ్లపై ఓ సినిమా చేస్తామని ప్రకటించారని చెప్పిన రేణూ దేశాయ్, పరోక్షంగా అంబటి ప్రస్తావన తెరపైకి తెచ్చారు. దీంతో మంత్రి అంబటి నేరుగా రియాక్ట్ అయ్యారనిపిస్తోంది. అయితే అంబటి.. రేణూ దేశాయ్ పేరుని నేరుగా ప్రస్తావించడంతో ఆయన ట్వీట్ మరింత వైరల్ గా మారింది.
అంబటి ట్వీట్ కి పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు దారుణమైన రిప్లైలు ఇస్తున్నారు. సంజన, సుకన్య పేర్లతోపాటు.. మంత్రి తల్లి పేరు, భార్య పేరు కూడా ట్వీట్లలో చేరుస్తూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.