రా కదలిరా.. అంటే వచ్చేవారెవరూ లేరు.. చంద్రబాబుపై అంబటి సెటైర్లు
ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కనిపించరని, హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సిందేనని చెప్పారు.
ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదలిరా' పేరిట సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబు రా కదలిరా.. అంటే వచ్చేవారెవరూ లేరన్నారు. ఆదివారం మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఆంబోతులకు ఆవులను సప్లయ్ చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కనిపించరని, హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సిందేనని చెప్పారు. ఇచ్చిన ప్రతి హమీ నిలబెట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అయితే, ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించి అధికారంలోకి వస్తే ఇక్కడ ఎయిర్ పోర్ట్ కడతామని హామీ ఇచ్చారని, మరి అన్నేళ్లు అధికారంలో ఉండి కుప్పం అభివృద్ధి గురించి ఎందుకు పట్టించుకోలేదని అంబటి ప్రశ్నించారు.
రా కదలిరా.. అని చంద్రబాబు పిలుపు ఇస్తే వచ్చేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. అసలు చంద్రబాబుకు, లోకేష్ కు ప్రజాదరణ కూడా లేదని చెప్పారు. అఫీషియల్, అనఫీషియల్ గా పొత్తులు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్ ను ఓడించలేరని అంబటి అన్నారు.