పవన్‌ను తప్పించడంలో బాబు, లోకేశ్ సక్సెస్ - అంబటి
జనసేనాని పవన్‌కల్యాణ్‌ను చూస్తే తనకు జాలేస్తుందన్నారు అంబటి. పవన్‌కల్యాణ్ సీఎం అవుతారని కాపు సామాజిక వర్గం ప్రజలు ఆశించారని.. సీఎం, సీఎం అంటూ గొంతులు చించుకుని అరిచారన్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని వైసీపీ ఓడించడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈ పొత్తు ఊహించిందేనని.. తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. గతంలో తెలుగుదేశం బీజేపీని అనరాని మాటలందని, వ్యక్తిగతంగా మోడీపైనా చంద్రబాబు విమర్శలు చేశారన్నారు అంబటి. పవన్‌కల్యాణ్ సైతం బీజేపీపై విరుచుకుపడ్డాడని గుర్తుచేశారు. గతంలో అమిత్ షా వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తే రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదన్నారు అంబటి. గతంలో ముగ్గురు కలిసి అధ్వాన్న పాలన చేశారని, ముగ్గురి కలయిక వల్ల ఏపీకి అదనంగా ఒరిగిందేం లేదన్నారు.
టీడీపీ,బీజేపీ,జనసేన అనైతిక పొత్తు.. ఊహించిందే.
— YSR Congress Party (@YSRCParty) March 9, 2024
2014లో అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి చేసిన మోసం ప్రజలు ఇంకా మరువలేదు.
సీఎం @ysjagan గారిని మరోసారి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
-మంత్రి అంబటి రాంబాబు#TDPJSPCollapse#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/NbEhTLph4d
ఇక జనసేనాని పవన్‌కల్యాణ్‌ను చూస్తే తనకు జాలేస్తుందన్నారు అంబటి. పవన్‌కల్యాణ్ సీఎం అవుతారని కాపు సామాజిక వర్గం ప్రజలు ఆశించారని.. సీఎం, సీఎం అంటూ గొంతులు చించుకుని అరిచారన్నారు. వారికి పవన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు అంబటి. పవన్‌కల్యాణ్ పార్లమెంట్‌కు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయని.. పవన్‌ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించే ప్లాన్‌లో చంద్రబాబు, లోకేశ్ సక్సెస్ అయ్యారన్నారు అంబటి.
దత్తపుత్రుడు, దత్త తండ్రి అమిత్ షా కాళ్లపై పడ్డారని.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శలు గుప్పించారు అంబటి. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుదన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సర్వే చేసుకున్న ముఖ్యమంత్రి జగనే కావాలని కోరుకుంటున్నారని స్పష్టమవుతుందన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ఓడించలేరన్నారు అంబటి.