Telugu Global
Andhra Pradesh

తమ జాడేది దత్త పుత్రా.. పవన్ కు అంబటి పంచ్..

"గడప గడపకు" చూసి ఓర్వలేక అడ్డంకులు కల్పించడానికి మీరు పడుతున్న ఆపసోపాలు అన్నీ ఇన్నీ కావు! వానలు, వరదలు వచ్చినా ప్రజల మధ్యనే మేమున్నాం. తమ జాడేది?.. దత్తపుత్రా అంటూ అంబటి రాంబాబు పవన్ కి కౌంటర్ గా ట్వీట్ వేశారు.

తమ జాడేది దత్త పుత్రా.. పవన్ కు అంబటి పంచ్..
X

గడప గడప కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుని జనం తరుముకుంటున్నట్టు జనసేనాని ట్వీట్ చేసిన కార్టూన్ పై గట్టి కౌంటర్ పడింది. వానొచ్చినా, వరదొచ్చినా తాము జనం మధ్యనే ఉంటున్నామని, కానీ తమరు మాత్రం కనపడటంలేదంటూ పవన్ పై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. తమ జాడేది దత్త పుత్రా అని ప్రశ్నించారు అంబటి.

"గడప గడపకు" చూసి ఓర్వలేక అడ్డంకులు కల్పించడానికి మీరు పడుతున్న ఆపసోపాలు అన్నీ ఇన్నీ కావు! వానలు, వరదలు వచ్చినా ప్రజల మధ్యనే మేమున్నాం. తమ జాడేది?.. దత్తపుత్రా అంటూ అంబటి రాంబాబు పవన్ కి కౌంటర్ గా ట్వీట్ వేశారు. ఇటీవల కాలంలో దత్తపుత్రుడనే మాట వినపడి చాలా రోజులవుతోంది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన జనసేన అర్థాంతరంగా ఆపేసింది. జనవాణి కూడా రెండు వారాల తర్వాత అలాగే ఆగిపోయింది. ప్రస్తుతం పవన్ రెస్ట్ మూడ్ లో ఉన్నారు. దీంతో పవన్ జనంలోకి రావట్లేదని కౌంటర్లు వేశారు అంబటి. వానొచ్చినా, వరదొచ్చినా తాము జనంలోకి వెళ్లకుండా లేమని, కానీ పవన్ మాత్రం వైరల్ ఫీవర్ అడ్డు పెట్టుకుని షూటింగ్ లకు పరిమితమయ్యారనే అర్థం వచ్చేలా కౌంటర్ ఇచ్చారు అంబటి.

గడప గడప హిట్టా..? ఫట్టా..?

ఇటీవల గడప గడప కార్యక్రమంపై టీడీపీ అనుకూల మీడియా ఫోకస్ పెట్టింది. పింఛన్ల కోసం మహిళలు నిలదీసిన సందర్భాలు, రేట్లు పెరుగుతున్నాయంటూ మంత్రుల్ని అడ్డుకున్న సందర్భాలను హైలెట్ చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబుకి కూడా చేదు అనుభవం ఎదురైనట్టు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. గడప గడపలో అంబటి బెండుతీశారంటూ వెబ్ సైట్స్ లో రాసుకొచ్చారు. దీనిపై అంబటి తీవ్రంగా ఫైరయ్యారు. గడప గడపలో ప్రజలంతా తమను ఆదరిస్తున్నారని, టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రమే కావాలని నిలదీస్తున్నారని చెబుతున్నారు. గడప గడప కార్యక్రమం సూపర్ హిట్ అంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు అవమానాలు ఎదుర్కొంటున్నారని, పరిస్థితి తమ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నారు.

First Published:  4 Aug 2022 3:38 PM IST
Next Story