ప్రజల గుండెల్లో జగన్.. ఆ బొమ్మ ఎలా చెరిపేస్తారు..?
ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీన ఫ్యాను గుర్తుకు వచ్చిన ఓట్లు చూసి చంద్రబాబు గుండె ఆగిపోవడం ఖాయమన్నారు. 175 నియోజకవర్గాల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు అంబటి.
స్కూల్ పిల్లల పుస్తకాల మీద, బ్యాగుల మీద జగన్ బొమ్మలు తీసేయాలని అంటున్నారని.. జగన్ ఉన్నది అక్కడ కాదని, ప్రజల గుండెల్లో అని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. ప్రజల గుండెల్లో ఉన్న జగన్ బొమ్మను ఎవరూ చెరపలేరని అన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీన ఫ్యాను గుర్తుకు వచ్చిన ఓట్లు చూసి చంద్రబాబు గుండె ఆగిపోవడం ఖాయమన్నారు. 175 నియోజకవర్గాల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు అంబటి.
అది అంతరించిపోయిన పార్టీ..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అంతరించిపోయిన పార్టీ అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసినా తమకు ఇబ్బంది లేదన్నారు. ఏపీలో హస్తం గుర్తుపై పోటీ చేసే ఏ నాయకుడికి కూడా డిపాజిట్లు రావన్నారు. ఎవరెవరు కలసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు అంబటి.
మైక్ మూగబోయినట్టే కూటమి కూడా..
చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బీజేపీతో పొత్తు ఉన్నా టీడీపీకి ఓటు వేస్తే ముస్లింల 4 శాతం రిజర్వేషన్ పోయినట్లేనని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన అదే కూటమి రాష్ట్రంలో గందరగోళం సృష్టించిందని, గెలిచిన తర్వాత ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకొని నీచంగా మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. వారి కుమ్ములాటను చూసిన ఏపీ ప్రజలు, మరోసారి కూటమికి ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అభద్రతాభావంతో ఉన్నారని అందుకే పవన్ తోపాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. దేశ ప్రధాని కూటమి సభకు వస్తే మైక్ కూడా సరిగ్గా పని చేయలేదని కౌంటర్ ఇచ్చారు. ప్రజాగళంలో మైకు మూగబోవడం, కూటమి ఓటమికి సంకేతం అని చెప్పారు. ప్రజాగళంలో కుర్చీలన్నీ ఖాళీగా కనపడ్డాయని అన్నారు అంబటి.