పవన్ నాలుగో పెళ్లాం ఎవరంటే..? అంబటి సెటైర్
తన నాలుగో పెళ్లాం జగనేనని కౌంటర్ ఇచ్చారు పవన్. ఈ డైలాగ్ ని జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు జనసైనికులకు సరైన సమాధానం చెప్పారు.
తాడేపల్లి గూడెం జెండా సభలో పవన్ కల్యాణ్ స్పీచ్ వైరల్ గా మారింది. అందులో జనసేనకు అత్యంత ఆసక్తిని కలిగించే అంశం కూడా ఒకటి ఉంది. సీఎం జగన్ పదే పదే తనకు నాలుగు పెళ్లిళ్లు అంటుంటారని, తనకు జరిగింది మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు మాత్రమేనని చెప్పారు పవన్. పనిలో పనిగా తన నాలుగో పెళ్లాం మరెవరో కాదు జగనేనని కౌంటర్ ఇచ్చారు. ఈ డైలాగ్ ని జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి వైసీపీ నుంచి కూడా బలమైన కౌంటర్ పడింది. మంత్రి అంబటి రాంబాబు జనసైనికులకు సరైన సమాధానం చెప్పారు.
జగన్ కాదు, నాదెండ్ల..
పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి. గతంలో కూడా పవన్ కి నాదెండ్ల ఆత్మ బంధువంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. దంపతులు చేయాల్సిన పూజల్ని వారిద్దరూ కలసి ఎందుకు చేస్తున్నారంటూ వైసీపీ నుంచి సెటైర్లు పడ్డాయి. ఇప్పుడు మరోసారి నాదెండ్ల పేరుని జతచేర్చి పవన్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు అంబటి. పవన్ నాలుగో పెళ్లాం నాదెండ్ల అని అన్నారు.
అంత బాధపడ్డావా..?
చంద్రబాబుని జైల్లో పెడితే బాధ కలిగిందని పవన్ జెండా సభలో విలపించారని, మరి వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు పవన్‌కు బాధ కలగలేదా? ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా? అని సూటిగా ప్రశ్నించారు మంత్రి అంబటి. పవన్ గురించి కాపు సోదరులు పునరాలోచించాలన్నారు అంబటి.
చంద్రబాబును జైల్లో పెడితే తనకు బాధ కలిగింది అన్నాడు పవన్‌కళ్యాణ్. మరి వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద దాడి చేసినప్పుడు బాధ కలగలేదా? 24 సీట్లు తీసుకునే బదులు 2014లో లాగా ఏమీ లేకుండా మద్దతిస్తే బాగుంటుంది.
— YSR Congress Party (@YSRCParty) February 29, 2024
-మంత్రి అంబ… pic.twitter.com/f3qU5hmEeZ
జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్ సరిపోరని, ఆయన్ను పుట్టించిన వాళ్లు దిగి రావాలన్నారు అంబటి. అసలు జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదన్నారు. జనసైనికులను అడిగితే పవన్ గొప్పో, జగన్ గొప్పో చెబుతారని అన్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి పవన్ ఆటలో అరటి పండులాంటి వారని తేల్చేశారు. పవన్‌తో పొత్తు ఎందుకు పెట్టుకున్నానా అని చంద్రబాబే ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు.