మేఘా ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా ప్రాజెక్ట్..
నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎలాంటి సమస్య లేకుండా ముందు చూపుతో దీన్ని ఏర్పాటు చేశారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ నీటి సరఫరా ప్రాజెక్ట్ నిర్మించింది.
నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా పథకాన్ని మొదలు పెట్టారు. రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎలాంటి సమస్య లేకుండా ముందు చూపుతో దీన్ని ఏర్పాటు చేశారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ నీటి సరఫరా ప్రాజెక్ట్ నిర్మించింది.
జగన్ చేతుల మీదుగా మరికొన్ని..
రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 33 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. నరసాపురం మున్సిపాల్టీకి సంబంధించి రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం, రూ.26.32 కోట్లతో వశిష్ట వారధి, రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి, రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం, రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్ ఫాల్ నాలుగు ఫ్లూయిస్ ల పునర్నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.