కంఫర్ట్ జోన్.. మెగాస్టార్ కి అంత భయమెందుకు..?
ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఏ కంఫర్ట్ చూసుకుని పవన్ కల్యాణ్, చిరంజీవికోసం పనిచేశారని.. ఇప్పుడు ఏ కంఫర్ట్ చూసుకుని చిరంజీవి, జనసేన కోసం బయటకు రావడంలేదని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
కొన్నిరోజుల క్రితం తమ్ముడు పవన్ కల్యాణ్ ని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన చిరంజీవీ, ఈరోజు మీడియా ముందుకొచ్చేసరికి తడబడిపోయారు. తన తమ్ముడికి కుటుంబం అండదండలు ఉన్నాయని చెప్పారే కానీ, రాజకీయ ప్రసంగం ఇవ్వలేకపోయారు. ఆ మాటకొస్తే తాను రాజకీయాలకు అతీతం అని కూడా చెప్పుకొచ్చారాయన. ఇక ఆయన మాటల్లో అతి ముఖ్యమైనది, ఇప్పుడు ట్రోలింగ్ కి కారణమైంది ఒకటి ఉంది. అదే 'కంఫర్ట్'.
నేను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేను.. నా తమ్ముడు గెలుపు కోసం పనిచేస్తున్నా.
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2024
నేను పిఠాపురం వెళ్లడం లేదు.. నేను ప్రచారానికి రావాలని నా తమ్ముడి ఎప్పుడూ కోరుకోలేదు - చిరంజీవి pic.twitter.com/YdKUPYs7DP
తాను పిఠాపురం వెళ్లడం లేదని, పవన్ తనను ప్రచారానికి ఎప్పుడూ రమ్మనలేదని, తన కంఫర్ట్ కి వదిలేశారని చెప్పుకొచ్చారు చిరంజీవి. కంఫర్ట్ కి వదిలేశారు అంటే.. ప్రచారానికి వస్తే ఆయన కంఫర్ట్ నెస్ ఏదో చెడిపోయినట్టే కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అంటే తమ్ముడికోసం ప్రచారానికి రావడానికి కూడా చిరంజీవి కంఫర్ట్ చూసుకుంటున్నారా అని అడుగుతున్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఏ కంఫర్ట్ చూసుకుని పవన్ కల్యాణ్, చిరంజీవికోసం పనిచేశారని.. ఇప్పుడు ఏ కంఫర్ట్ చూసుకుని చిరంజీవి, జనసేన కోసం బయటకు రావడంలేదని ట్రోల్ చేస్తున్నారు.
ముద్రగడ, పోసానికి భయపడ్డారా..?
సోషల్ మీడియాలో చిన్న వీడియో వదిలినందుకే చిరంజీవి విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యారు. తన ఫ్యామిలీని టార్గెట్ చేసినందుకు చిరు ఫ్యామిలీపై కూడా ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పోసాని విమర్శలు మరింత వైరల్ గా మారాయి. వారందరికీ సమాధానం చెప్పే ధైర్యం చిరంజీవికి లేదనే అనుకోవాలి. అదే ఉంటే ఈపాటికే ఆయన కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా సమాధానం చెప్పి ఉండేవారు. పిఠాపురం వస్తే ఇలాంటి విమర్శలు మరిన్ని ఎదురవడం ఖాయం. వీటిని తట్టుకోలేకే చిరంజీవి సోషల్ మీడియాలో దాక్కున్నారు. కంఫర్ట్ జోన్ చూసుకున్నారు. తన కంఫర్ట్ ని పవన్ గౌరవిస్తారని చెప్పుకొచ్చారు.