Telugu Global
Andhra Pradesh

మీ ఊపిరి కాంట్రాక్ట్ నాదే.. చిరంజీవి పొలిటికల్ డైలాగ్స్

కచ్చితంగా అవినీతి రాజకీయాలపై సినిమాలో సెటైర్లు ఉంటాయి. అయితే అవి ఎవరిని టార్గెట్ చేస్తాయి అనేది మాత్రం తేలాల్సి ఉంది.

మీ ఊపిరి కాంట్రాక్ట్ నాదే.. చిరంజీవి పొలిటికల్ డైలాగ్స్
X

"ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్ట్, ఇసుక కాంట్రాక్ట్, కొండ కాంట్రాక్ట్, నేల కాంట్రాక్ట్, నీళ్ల కాంట్రాక్ట్ అంటూ.. ప్రజల దగ్గర సొమ్ము తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఈరోజు నుంచి మీ ఊపిరి కాంట్రాక్టర్ ని నేనే.. మీ గాలి కాంట్రాక్ట్ నేనే తీసుకుంటున్నా. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నా. ఏదైనా జరగరానిది జరిగితే మీ ఊపిరి ఆగిపోతుంది, ఖబడ్దార్.." గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి డైలాగ్ ఇది. ఎమ్మెల్యేలందర్నీ ఓ రూమ్ లో కూర్చోబెట్టి.. చిరంజీవి ఈ డైలాగ్ చెబుతారు. ఈ డైలాగ్ ని అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పి అభిమానులకు పెద్ద కిక్ ఇచ్చారు మెగాస్టార్.

రాజకీయాలనుంచి నేను వేరు కాలేదంటూ ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ డైలాగ్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన చిరంజీవి, ఇప్పుడు సినిమాలో మరిన్ని పొలిటికల్ డైలాగ్ లు ఉంటాయని హింట్ ఇచ్చారు. కచ్చితంగా అవినీతి రాజకీయాలపై సినిమాలో సెటైర్లు ఉంటాయి. అయితే అవి ఎవరిని టార్గెట్ చేస్తాయి అనేది మాత్రం తేలాల్సి ఉంది.

బ్యాలెన్స్ చేశారా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కి ఉంది. ఈ దశలో చిరంజీవి వంటి పెద్ద హీరో పొలిటికల్ సినిమా చేశారు. ఇటు ఏపీలో చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ ఓ రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నారు, అధికార పక్షంపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ దశలో గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగులు కచ్చితంగా సమకాలీన రాజకీయాలను ప్రతిబింబిస్తాయనే అంచనాలున్నాయి. మరి చిరంజీవి సినిమా విడుదల తర్వాత ఈ పొలిటికల్ సీన్లు, డైలాగ్ లు ఏ పార్టీకి గుచ్చుకుంటాయో చూడాలి. ఒకవేళ నిజంగానే చిరంజీవి ఎవరినైనా టార్గెట్ చేస్తే మాత్రం.. అది సంచలనంగా మారుతుంది. తమ్ముడి రాజకీయాలను ప్రోత్సహించే విధంగా చిరంజీవి డైలాగులు చెప్పారా లేదా అనేది సినిమా రిలీజ్ రోజు తేలిపోతుంది.

First Published:  29 Sept 2022 1:42 AM GMT
Next Story