Telugu Global
Andhra Pradesh

కూటమి కేబినెట్ లో మంత్రులు వీరే.. సోషల్ మీడియాలో కామెడీ

కూటమి నేతలు కూడా ఈ వార్తలు చూసి, సదరు యాజమాన్యం అత్యుత్సాహం చూసి నవ్వుకుంటున్నారు.

కూటమి కేబినెట్ లో మంత్రులు వీరే.. సోషల్ మీడియాలో కామెడీ
X

ఏపీలో ఎన్నికలకు, ఫలితాలకు మధ్య ఈసారి చాలా గ్యాప్ వచ్చింది. దీంతో రాసుకున్నోళ్లకి రాసుకున్నంత, చెప్పుకున్నోళ్లకి చెప్పుకున్నంతలా మారిపోయింది పరిస్థితి. నిన్న మొన్నటి వరకు రాజకీయ విశ్లేషకులకు, నాయకులకు న్యూస్ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పెద్దపీట వేయగా, ఇప్పుడు సెఫాలజిస్ట్ లకు ప్రాధాన్యత పెరిగింది. సెల్ఫ్ మేడ్ సెఫాలజిస్ట్ లు చాలామంది తమ ఫలితాల లిస్ట్ పట్టుకుని ఛానెళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సర్వేల ప్రామాణికత ఏంటో తెలుసుకోకుండానే.. రాజకీయ పార్టీలు వాటిని తమకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక జనసేనకు అనుకూలంగా ఉండే ఓ ఛానెల్ మరో అడుగు ముందుకు వేసింది. కూటమి కేబినెట్ లో బెర్త్ లు కూడా ఖరారు చేస్తోంది.

ఏపీకి సంబంధించి న్యూస్ ఛానెళ్లు ఏవి ఏ పార్టీవైపో అందరికీ తెలుసు. అయితే న్యూట్రల్ ముసుగులో కొన్ని ఛానెళ్లు కూటమికి వంతపాడుతున్నాయి. వీళ్లకి పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తిగతంగా ఆయా నాయకులు ముట్టజెప్పే ప్యాకేజీయే ముఖ్యం. అందుకే పూర్తిగా పార్టీ స్టాండ్ తీసుకోకుండా నాయకులకు అనుకూలంగా వార్తల్ని వండి వారుస్తుంటారు. అలాంటి న్యూస్ ఛానెల్ ఒకటి తాజాగా కూటమి కేబినెట్ ని ప్రకటించింది. కూటమిలో జనసేనకు 3 కేబినెట్ బెర్త్ లు ఉన్నాయని, ఆ మూడింటిని ఎవరెవరికి ఇస్తారో కూడా అనౌన్స్ చేసింది. ఈ కేబినెట్ కూర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కూటమి అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. కనీసం టీడీపీ నేతల్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఇలాంటి టైమ్ లో కూటమి కేబినెట్ అంటూ సదరు న్యూస్ ఛానెల్ సోషల్ మీడియాలో కామెడీ పంచుతోంది. పదవుల పందేరం మొదలు పెట్టింది. తమకు అనుకూలమైన వారికి పోర్ట్ ఫోలియోలు కూడా కేటాయిస్తోంది. కూటమి నేతలు కూడా ఈ వార్తలు చూసి, సదరు యాజమాన్యం అత్యుత్సాహం చూసి నవ్వుకుంటున్నారు.

First Published:  21 May 2024 6:14 AM GMT
Next Story