Telugu Global
Andhra Pradesh

అది ఫేక్ న్యూస్‌.. గుడివాడ టికెట్‌పై హ‌నుమంత‌రావు క్లారిటీ

హ‌నుమంత‌రావుకు వైసీపీ టికెట్ ఇస్తున్నారంటూ సోమ‌వారం గుడివాడ‌లో ఫ్లెక్సీలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. కొడాలి నానికి కాకుండా వేరేవారికి టికెట్ ఇస్తున్నారా..? అని విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రిగింది.

అది ఫేక్ న్యూస్‌.. గుడివాడ టికెట్‌పై హ‌నుమంత‌రావు క్లారిటీ
X

గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానిని కాద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత మండ‌లి హ‌నుమంత‌రావుకు ఇస్తున్నార‌న్న ప్ర‌చారానికి తాత్కాలికంగా తెర‌ప‌డింది. స్వ‌యానా హ‌నుమంత‌రావే విలేక‌ర్ల స‌మావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. త‌న‌కు గుడివాడ టికెట్ ఇస్తున్నార‌న్న‌ది దుష్ప్ర‌చార‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

నానిని దాటి వెళ్లే మ‌నిషిని కాను

హ‌నుమంత‌రావుకు వైసీపీ టికెట్ ఇస్తున్నారంటూ సోమ‌వారం గుడివాడ‌లో ఫ్లెక్సీలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. సీఎంకు అనుంగు అనుచ‌రుడ‌డైన కొడాలి నానికి కాకుండా వేరేవారికి టికెట్ ఇస్తున్నారా..? అని రాష్ట్రవ్యాప్తంగా విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రిగింది. అయితే దీనిపై హ‌నుమంత‌రావు ఎమ్మెల్యే కొడాలి నానితో క‌లిసి విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. త‌న‌కు టికెట్ అనేది దుష్ప్ర‌చార‌మేన‌ని, అయినా తాను కొడాలి నానిని కాద‌ని ముందుకెళ్లే వ్య‌క్తిని కాద‌ని తేల్చిచెప్పేశారు.

నాని టికెట్ సేఫేనా..?

ఇదిలా ఉంటే కొడాలి నాని అనుచ‌రుడైన మెరుగుమాల కాళీయాద‌వ్‌కు గుడివాడ టికెట్ ఇవ్వ‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇలా ఒక‌దాని వెంట ఒక‌టిగా ప్రత్యామ్నాయ పేర్లు తెర‌పైకి వ‌స్తున్న నేప‌థ్యంలో కొడాలి నాని సీటు సేఫేనా అనే కామెంట్లూ వినబ‌డుతున్నాయి.

First Published:  20 Feb 2024 12:52 PM IST
Next Story