అనుకున్నదే అయింది.. జనసేన గుర్తుపై టీడీపీ నేతల పోటీ
టీడీపీ-జనసేన కూటమి కలిసినప్పుడే ఇలాంటి వ్యవహారం ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఈ స్థాయిలో చంద్రబాబు మోసం చేస్తారని జనసేన నేతలు ఊహించలేకపోయారు.
2019 ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్
2024 అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్
2019లో పాలకొండ టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ
2024లో పాలకొండ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ
పాలకొండ నియోజక వర్గానికి చెందిన శ్రీ నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఈ రోజు పిఠాపురంలో ఆయనకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.#HelloAP_ByeByeYCP pic.twitter.com/3uLyoxfIHC
— JanaSena Party (@JanaSenaParty) April 1, 2024
ఈ కేటాయింపులు చూసి జనసైనికులందరూ ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబుకి జనసేనను పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని తెలుసు కానీ, మరీ ఇంత దారుణంగా ఆ పార్టీకి దాసోహం అయిపోతారని మాత్రం వారు ఊహించలేదు. ముందు 24 సీట్లు అన్నారు, ఆ తర్వాత 21కి తెగ్గోశారు, తీరా ఇప్పుడు టీడీపీ నేతల్నే జనసేనలోకి పంపించి వారినే అక్కడ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. మరి ఇన్నేళ్లు జనసేన జెండా భుజాన మోసిన నేతలు, పార్టీకోసం వృత్తి, వ్యాపారాలు మానేసుకుని కష్టపడినవారు ఏం కావాలి..? ఏం చేయాలి..?
టీడీపీ-జనసేన కూటమి కలిసినప్పుడే ఇలాంటి వ్యవహారం ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఈ స్థాయిలో చంద్రబాబు మోసం చేస్తారని జనసేన నేతలు ఊహించలేకపోయారు. పవన్ కూడా నమ్మినవారికి ఇలాంటి ద్రోహం చేస్తారని వారు అంచనా వేయలేదు. కానీ చివరికి టీడీపీ నేతలు జనసేన కండువాలు కప్పుకొని పోటీకి రెడీ అయ్యారు. అసలుసిసలు జనసేన నేతలకు షాకిచ్చారు. అవనిగడ్డ సీటుకోసం మండలి బుద్ధ ప్రసాద్ జనసేన కండువా కప్పుకొన్నారు. పాలకొండ నియోజకవర్గం కోసం నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు.
అవనిగడ్డ, పాలకొండ స్థానాల్లో పలువురు నాయకుల పేర్లతో జనసేన సర్వేలు చేయించినట్టు సమాచారం. ఆ సర్వేల్లో జనసేన నాయకులంతా ఫెయిలైనట్టు.. అవనిగడ్డలో మండలి, పాలకొండలో జయకృష్ణ పేర్లు మాత్రమే విజయానికి దగ్గర్లో ఉన్నట్టు ఓ సీన్ క్రియేట్ చేశారు. దీంతో వారిద్దరికీ హడావిడిగా జనసేన కండువాలు కప్పేశారు. అధికారికంగా వారిద్దరు పేర్లు ప్రకటించేసి త్వరలో లాంఛనం పూర్తి చేస్తారు పవన్.