జనసేనలో చేరిన బుద్ధప్రసాద్.. అవనిగడ్డ నుంచి పోటీ!
కాపుల జనాభా ఎక్కువగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి కృష్ణారావు నాటి నుంచి ఈ కుటుంబానికి పట్టుంది. పొత్తులో ఈ సీటు జనసేనకు దక్కినా ఏ అభ్యర్థిని నిలబెట్టినా మండలి బుద్ధప్రసాద్ పూర్తిస్థాయిలో పని చేయరని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు తెలిసిపోయింది.
టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం జనసేనకు దక్కిన నేపథ్యంలో బుద్ధప్రసాద్ ఇక్కడి నుంచే పోటీకిదిగడం ఖాయమైపోయినట్లే. జనసేన తరఫున ఇక్కడ పోటీ చేద్దామని ఆశించిన నేతలకు షాకిస్తూ బుద్ధప్రసాద్ ఈరోజు సడన్‌గా పిఠాపురం వెళ్లి పవన్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకోవడం హైలైట్.
మూడుసార్లు నెగ్గిన మండలి
సీనియర్ కాంగ్రెస్ నేత మండలి కృష్ణారావు కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బుద్ధప్రసాద్. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫునా ఎమ్మెల్యేగా గెలిచారు. డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్యుడైన రాజకీయ నేతగా పేరుంది.
అవనిగడ్డలో పట్టుందని కండువా కప్పి టికెటిచ్చేస్తున్నారు
కాపుల జనాభా ఎక్కువగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి కృష్ణారావు నాటి నుంచి ఈ కుటుంబానికి పట్టుంది. పొత్తులో ఈ సీటు జనసేనకు దక్కినా ఏ అభ్యర్థిని నిలబెట్టినా మండలి బుద్ధప్రసాద్ పూర్తిస్థాయిలో పని చేయరని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు తెలిసిపోయింది. అందుకే కండువా కప్పేసి జనసేనలోకి తీసుకుని, అవనిగడ్డ టికెటివ్వబోతున్నారు. ఎప్పటి నుంచోఇక్కడ సీటు ఆశించి పనిచేస్తున్న బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్‌లను కాదని బుద్ధప్రసాద్‌ను పార్టీలో చేర్చుకోవడం తమను ముంచేయడమేనంటూ ఆయా నేతలు భగ్గుమంటున్నారు.