Telugu Global
Andhra Pradesh

మద్దిపాటి VS ముళ్లపూడి... గోపాలపురం టీడీపీలో చిచ్చు

మద్దిపాటు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు. మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మద్దిపాటి VS ముళ్లపూడి... గోపాలపురం టీడీపీలో చిచ్చు
X

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గపోరు ముదురుతోంది. నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. పార్టీ అధినేత చంద్రబాబు ముందే రెండు వర్గాలు విమర్శలు చేసుకున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారింది.

నల్లజర్లలో చంద్రబాబు క్యాంపు దగ్గరకు చేరుకున్న ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని అంగీకరించేది లేదంటూ నినాదాలు చేశారు. దీంతో ముళ్లపూడిని పిలిచి మాట్లాడారు చంద్రబాబు. అయినప్పటికీ ముళ్లపూడి వర్గం శాంతించలేదు.

మద్దిపాటు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు. మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించి నిరసన తెలిపారు. గోపాలపురంలో కొన్నేళ్లుగా మద్దిపాటి, ముళ్లపూడి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మద్దిపాటి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు ముళ్లపూడి వర్గీయులు.

First Published:  5 April 2024 7:15 PM IST
Next Story