హోదా చుట్టూ రంజుగా సాగుతున్న రాజకీయం
ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ప్రత్యేక హోదా డిమాండ్‌ను టీడీపీ భుజానికెత్తుకుంది. బీజేపీలో కొందరు నేతలు హోదా రాదని చెప్పేస్తుంటే సుజనా లాంటి వాళ్ళేమో జగన్‌నే తప్పుపడుతున్నారు.
ప్రత్యేక హోదా కేంద్రంగా రాష్ట్రంలో భలే గేమ్ మొదలవుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని తాజాగా మరోసారి స్పష్టంగా చెప్పేసింది. నిజానికి 2019 ఎన్నికల నాటికే హోదా అన్నది ముగిసిన అధ్యాయమని కేంద్రం చెప్పేసింది. అప్పట్లో మాట్లాడని వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా పాటందుకున్నారు. హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. హోదా ఇవ్వని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయాలని చూస్తున్నారు.
ఇక్కడే బ్లేమ్ గేమ్ రంజుగా సాగుతోంది. 2014లో ఎన్డీయే పార్టనర్‌గా ఉన్నపుడే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దని చెప్పేశారు. హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే సరే అన్నారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌తో పాటు తమ్ముళ్ళు హోదా సాధనలో జగన్ ఫెయిలయ్యారంటు నానా గోల చేస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీలు ఇదే పద్ధతిలో జగన్‌ను కార్నర్ చేయాలని పదేపదే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్డీయేలో చంద్రబాబు పార్టనర్‌గా ఉన్నపుడు టీడీపీ తరపున కేంద్రంలో సుజనా చౌదరి మంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రి హోదాలో ఆయనే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి సుజనా కూడా ఇప్పుడు హోదా సాధనలో జగన్ విఫలమయ్యారని చెప్పటమే విచిత్రంగా ఉంది. బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి లాంటి వాళ్ళు కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని చాలాసార్లు చెప్పారు.
టీడీపీ, బీజేపీ నేతలంతా హోదా ఇవ్వని మోడీ ప్రభుత్వాన్ని వదిలేసి జగన్‌ను బాధ్యుడిని చేస్తుంటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ప్రత్యేక హోదా డిమాండ్‌ను టీడీపీ భుజానికెత్తుకుంది. బీజేపీలో కొందరు నేతలు హోదా రాదని చెప్పేస్తుంటే సుజనా లాంటి వాళ్ళేమో జగన్‌నే తప్పుపడుతున్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా చుట్టూ కొత్తగా గేమ్ మొదలవుతున్నట్లే అనుమానంగా ఉంది. విచిత్రం ఏమిటంటే ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని ప్రకటించిన నిత్యానందరాయ్ ప్రకటనను తప్పుపడుతు మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.హోదా రాకపోవటానికి తప్పంతా జగన్‌ది మాత్రమే అన్నట్లుగా ఆరోపణలు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.