Telugu Global
Andhra Pradesh

లోకేష్ చెప్పింది నిజమేనా?

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వానికి లేని గొప్పతనాన్ని ఆపాదిస్తునే జగన్ ప్రభుత్వంపై బురదచల్లేశారు. విషయం ఏమిటంటే ఫ్యాక్స్ కాన్ కంపెనీ అసలు ఏపీకి రానేలేదు.

లోకేష్ చెప్పింది నిజమేనా?
X

ముమ్మిడివరం నియోజకవర్గం యువగళం పాదయాత్రలో లోకేష్ ఒక విషయాన్ని చెప్పారు. విషయం చెప్పటం అనేకన్నా జగన్‌ ప్రభుత్వంపై బురదచల్లేశారంటే సబబుగా ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలన్నింటినీ జే ట్యాక్స్ కోసం వేధించి తరిమేసినట్లు ఆరోపించారు. జే గ్యాంగ్ పుణ్యమా అని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ఫ్యాక్స్ కాన్, లులూ, అమరరాజా, జాకీ కంపెనీలు రాష్ట్రం నుండి పారిపోయినట్లు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వానికి లేని గొప్పతనాన్ని ఆపాదిస్తునే జగన్ ప్రభుత్వంపై బురదచల్లేశారు. విషయం ఏమిటంటే ఫ్యాక్స్ కాన్ కంపెనీ అసలు ఏపీకి రానేలేదు. దేశం మొత్తంమీద ఫ్యాక్స్ కాన్ కంపెనీ బెంగుళూరులో మాత్రమే ఏర్పాటైంది. రెండో యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయించేందుకు మంత్రి కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. అలాంట‌ప్పుడు ఫ్యాక్స్ కాన్ ఏపీలో ఎప్పుడు ఏర్పాటైంది? జగన్ తరిమేసిందెప్పుడు?

ఇక లులూ గ్రూపు కంపెనీ అసలు నిర్మాణమే మొదలుపెట్టలేదు. లులూ గ్రూపు ఆధ్వర్యంలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తామని చెప్పి వైజాగ్‌లో చంద్రబాబు హయాంలో స్థ‌లం తీసుకున్నారు. అయితే స్థ‌లం తీసుకుని మూడేళ్ళయినా నిర్మాణమే మొదలుపెట్టలేదు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని యాజమాన్యంతో చర్చలు జరిపింది. ఏమైందో ఏమో యాజమాన్యం ఏపీ నుండి వెళ్ళిపోయింది. నిజానికి అత్యంత ఖరీదైన స్థ‌లాన్ని అత్యంత చీపుగా యాజమాన్యం తీసుకున్నది మాల్‌ను ఏర్పాటు చేయటం కోసమేనా అనే అనుమానాలు అప్పట్లోనే వచ్చింది.

ఎందుకంటే స్థ‌లం తీసుకుని మూడేళ్ళయినా యాజమాన్యం ఎందుకు మాల్ నిర్మించలేదు ? దీనికి చంద్రబాబు, లోకేష్ అండ్ కో సమాధానం చెప్పరు. 2019లో కూడా చంద్రబాబే అధికారంలోకి వస్తే తీసుకున్న స్థ‌లాన్ని రియల్ ఎస్టేట్‌గా మార్చేయాలని యాజమాన్యం అనుకున్నట్లుంది. అయితే జగన్ అధికారంలోకి రావటంతో ఏపీ నుండి వెళ్ళిపోయింది. అమరరాజా కంపెనీ ఏపీ నుండి ఎక్కడికి పారిపోలేదు. విస్తరణలో భాగంగా తెలంగాణలో మరో యూనిట్ ఏర్పాటు చేస్తోందంతే.

ఇక జాకీ కంపెనీ చంద్రబాబు హయాంలోనే ఏపీ నుండి పారిపోయింది. ఎందుకంటే అనంతపురంలో స్థ‌లం తీసుకున్న యాజమాన్యం కాంపౌండ్ వాల్ నిర్మించిందంతే. అక్కడి నుండి ప్రజాప్రతినిధులు కంపెనీ పనులను ముందుకు జరగనీయలేదు. అప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ఎవరు టీడీపీవాళ్ళే కదా ? సో లోకేష్ చెప్పిందాంట్లో ఏమాత్రం వాస్తవంలేదని అర్థ‌మైపోతోంది.

First Published:  1 Dec 2023 10:41 AM IST
Next Story