లోకేష్‌లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా?
పాదయాత్రలో పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేస్తున్న అధికారులతో వాగ్వాదం పెట్టుకోవటం, వాళ్ళని అవమానిస్తు మాట్లాడుతున్నారు. పోలీసులకు వార్నింగులు కూడా ఇస్తున్నారు.
పాదయాత్ర ఆశించిన స్థాయిలో జరగకపోవటం, పైగా పెయిలైందనే ప్రచారం నేపథ్యంలో నారా లోకేష్‌లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పోలీసులతో గొడవలు పెట్టుకుంటున్నారు. పాదయాత్రలో పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేస్తున్న అధికారులతో వాగ్వాదం పెట్టుకోవటం, వాళ్ళని అవమానిస్తు మాట్లాడుతున్నారు. పోలీసులకు వార్నింగులు కూడా ఇస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు జనాలు రావటంలేదనే కోపంతోనే ఇదంతా చేస్తున్నట్లు అర్థమైపోతోంది. ఈ స్టేజంతా దాటిపోయి జనాలపైనే విరుచుకుపడ్డారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోలేదట వైసీపీ గెలిచిందట. ఇదేమి లాజిక్‌కో లోకేష్‌కే అర్ధంకావాలి. ఇలాంటి పిచ్చి లాజిక్‌లు మాట్లాడుతున్నాడు కాబట్టే లోకేష్‌ను వైసీపీ వాళ్ళు ‘మందలగిరి మాలోకం’ అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తాలూకు షాక్ నుండి చంద్రబాబునాయుడు, లోకేష్ ఇంకా కోలుకున్నట్లు లేదు. అందుకనే నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. కార్వేటినగరంలో జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ కాదని జనాలే ఓడిపోయారని మండిపడ్డారు.
టీడీపీని కాదని వైసీపీని గెలిపించటం ద్వారా రాష్ట్ర ప్రజలు ఓడిపోయినట్లు పిచ్చిగా మాట్లాడారు. అయ్యారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు కూడా అచ్చంగా ఇలాగే మాట్లాడుతున్నారు. ఓడిపోయిన కొత్తల్లో అయితే వైసీపీని గెలిపించినందుకు చంద్రబాబు చాలాసార్లు జనాలకు శాపనార్ధాలే పెట్టారు. వైసీపీకి ఓట్లేసినందుకు జనాలకు తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా మాట్లాడారు.
అంటే తండ్రీకొడుకుల ఉద్దేశంలో జనాలు టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు. అదే వేరే పార్టీని గెలిపిస్తే తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఓటమిని తండ్రి, కొడుకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమైపోతోంది. ఎన్నికలు జరిగిన కొత్తల్లో ఇలా మాట్లాడారంటే ఏదోలే ఓటమి బాధతో మాట్లాడారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఎన్నికలైపోయి ఇంతకాలమైనా, మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కూడా వాళ్ళ ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదంటే అర్థమేంటి? జనాల తీర్పు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై చంద్రబాబు, లోకేష్‌లో ఎంతటి ఫ్రస్ట్రేషన్ పేరుకుపోయిందో అర్థమైపోతోంది. ఇలాగే మాట్లాడుతుంటే ఇపుడున్న సీట్లయినా వస్తాయా?