Telugu Global
Andhra Pradesh

3రోజుల్లో 4సార్లు చెక్ చేస్తారా..? లోకేష్ ఫ్రస్టేషన్

పోలీస్ లను బెదిరించడానికి నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ మెయింటెన్ చేస్తున్నారు. తన కార్లను ఆపడమే పాపమైనట్టుగా ఆయన పోలీసులపై రంకెలేయడం మరో విశేషం.

3రోజుల్లో 4సార్లు చెక్ చేస్తారా..? లోకేష్ ఫ్రస్టేషన్
X

పోలీసులు బాగా పనిచేయాలి, కానీ చెకింగ్ పేరుతో తన కారు మాత్రం ఆపకూడదంటున్నారు నారా లోకేష్. ఇదెక్కడి లాజిక్కో ఆయనకే తెలియాలంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పోలీసులు పలు చోట్ల చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు, అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను ఎక్కడికక్కడ ఆపి తనిఖీ చేస్తున్నారు. రాజకీయ నాయకుల కాన్వాయ్ లను కూడా వారు తరచూ తనిఖీలు చేస్తున్నారు. అయితే తాను మాత్రం ఆ తనిఖీలకు అతీతుడినంటూ చెబుతున్నారు నారా లోకేష్. 'ప్రతిరోజూ నా కారే చెక్ చేస్తారా'..? అంటూ ఫ్రస్టేషన్ కి లోనయ్యారు.


మూడురోజుల్లో తన కాన్వాయ్ ని నాలుగుసార్లు పోలీసులు ఆపి తనిఖీ చేశారని, ఈరోజు ఒక్కరోజే రెండుసార్లు చెక్ చేశారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా వారిపై రెచ్చిపోయారు. కోడ్ అమలులో భాగంగా తాము తనిఖీలు చేస్తున్నామని, సహకరించాలని పోలీసులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా ఆయన ఫ్రస్టేట్ అయ్యారు. వైసీపీ నేతల కార్లు ఎందుకు చెక్ చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతల కార్లను మాత్రమే ఆపాలని ఏమైనా ఆదేశాలున్నాయా అని అడిగారు లోకేష్.

టీడీపీ నేతల అత్యుత్సాహం..

చంద్రబాబు, లోకేషే కాదు.. చాలామంది టీడీపీ నేతలు.. వైసీపీ నేతలు, అధికారులకు వార్నింగ్ లు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చాక మీ అంతుచూస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు మొదలు పెడతామని ఇప్పటికే నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సెలవిచ్చారు. పలుచోట్ల వాలంటీర్లపై టీడీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇక పోలీస్ లను బెదిరించడానికి నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ మెయింటెన్ చేస్తున్నారు. తన కార్లను ఆపడమే పాపమైనట్టుగా ఆయన పోలీసులపై రంకెలేయడం మరో విశేషం.

First Published:  24 March 2024 7:56 PM IST
Next Story