తాజా సర్వే.. కూటమిలో బీజేపీ చేరికతో పెరిగిన జగన్ సీట్ల సంఖ్య
మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 19 నుంచి 20 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. టీడీపీ, జనసేన కూటమిలో బిజెపి చేరిన తర్వాత వైసీపీ సాధించే సీట్ల సంఖ్య పెరిగినట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కూటమిలో బిజెపి చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంభవించిన పరిణామాలపై, మారిన సమీకరణాలపై, ఓటరు నాడి ఎలా ఉందనే విషయంపై, ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై జన్‌మత్ సంస్థ తాజాగా ఒపీనియన్ పోల్ నిర్వహించింది.
రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభా స్థానాల్లో వైసీపీ 119 నుంచి 122 స్థానాలను గెలుచుకుంటుందని ఆ సంస్థ తేల్చింది. గతంలో జన్‌మత్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వైసీపీకి 114 నుంచి 117 స్థానాలు వస్తాయని తేలింది. టీడీపీ, జనసేన కూటమిలో బిజెపి చేరిన తర్వాత వైసీపీ సాధించే సీట్ల సంఖ్య పెరిగినట్లు జన్‌మత్ సంస్థ తాజా సర్వే తెలియజేస్తోంది. టీడీపీ, జనసేన, బిజెపి కూటమికి 49 నుంచి 51 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేల్చింది.
మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 19 నుంచి 20 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. టీడీపీ, జనసేన, బిజెపి కూటమికి ఐదు నుంచి ఆరు లోక్‌సభ స్థానాలు వస్తాయని ఆ సర్వే తేల్చింది.