విరిగిపడిన కొండచరియలు.. విశాఖ కార్పొరేటర్లు సేఫ్
స్టడీ టూర్ కోసం ఈ నెల 16న 81 మంది కార్పొరేటర్లు, 14 మంది సిబ్బంది కూడిన బృందం బయలుదేరి వెళ్లింది. చండీగఢ్ కు 240 కిలోమీటర్లు, మండికి 12 కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగిపడటంతో వీరి బస్సులు నిలిచిపోయాయి.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల స్టడీటూర్ ముగింపు దశలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మనాలిలో టూర్ పూర్తయ్యాక చండీగఢ్‌కు వెళ్తుండగా కొండచరియలు విరిగిపడటంతో బస్సులోనే కార్పొరేటర్లు ఉండిపోయారు. సమాచారం అందుకున్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మిషా ఆ ప్రాంతాల పరిధి జిల్లా కలెక్టర్లతో చర్చించారు. కార్పొరేటర్లకు ఆహారంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వారంతా సురక్షితంగా వున్నారని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మిషా వెల్లడించారు.
స్టడీ టూర్ కోసం ఈ నెల 16న 81 మంది కార్పొరేటర్లు, 14 మంది సిబ్బంది కూడిన బృందం బయలుదేరి వెళ్లింది. చండీగఢ్ కు 240 కిలోమీటర్లు, మండికి 12 కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగిపడటంతో వీరి బస్సులు నిలిచిపోయాయి. స్టడీ టూర్‌కి వెళ్లినవారిలో డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, జనసేన ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి, సీపీఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ ఉన్నారు. కొండచరియలు విరిగిపడటం వల్ల కార్పొరేటర్లకి ఏ ప్రమాదం జరగలేదు. అయితే వారి ప్రయాణం నిలిచిపోవడంతోపాటు వసతి-ఆహారం సమస్య తలెత్తింది. దీనికి కూడా ఆయా ప్రాంత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.