ముమ్మాటికీ ట్యాంపరింగే.. తేల్చి చెప్పిన లక్ష్మీపార్వతి
స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకి వెళ్లినప్పుడు రహస్య ప్రదేశంలో ఉన్నారని, అక్కడినుంచి ఆయన ట్యాంపరింగ్ నేర్చుకున్నారని, అలా నేర్చుకున్న ట్యాంపరింగ్ ని ఎన్నికలప్పుడు ఉపయోగించి గెలిచారని చెప్పారు లక్ష్మీపార్వతి.

చంద్రబాబు విజయానికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని తేల్చి చెప్పారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. ఆ ట్యాంపరింగ్ ఎలా చేశారో కూడా ఆమె వివరించారు. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకి వెళ్లినప్పుడు రహస్య ప్రదేశంలో ఉన్నారని, అక్కడినుంచి ఆయన ట్యాంపరింగ్ నేర్చుకున్నారని, అలా నేర్చుకున్న ట్యాంపరింగ్ ని ఎన్నికలప్పుడు ఉపయోగించి గెలిచారని చెప్పారు. సాక్షి ఛానెల్ లో లక్ష్మీపార్వతి మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
"#ChandraBabu ని జైలు లో పెట్టాక రహస్య ప్రదేశాల్లో ఉండి EVM Tampering ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు" - #LakshmiParvathi pic.twitter.com/xvuJzaKBdm
— Daily Culture (@DailyCultureYT) June 11, 2024
ప్రధాన కారణం ట్యాంపరింగే..
వైసీపీ పరాజయానికి కారణాలేంటి అనే పోస్ట్ మార్టమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సాక్షి మీడియాలో ప్యానలిస్ట్ లు రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు. ఎన్నికల ముందు వచ్చిన వారు ఫలితాల తర్వాత చర్చలకు దూరం జరగడంతో కొత్త బృందం ఫలితాలను తమదైన శైలిలో విశ్లేషిస్తోంది. లక్ష్మీపార్వతి కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఈవీఎం ట్యాంపరింగేనని అంటున్నారు.
నేతలతో జగన్ సమాలోచనలు..
మరోవైపు ఎన్నికల ఫలితాలపై అటు జగన్ కూడా నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడినవారు, కీలక నేతలంతా జగన్ ని కలుస్తున్నారు. అందరికీ సమయం కేటాయిస్తూ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టారు జగన్. ఫలితాలు ఊహించని రీతిలో వచ్చినా.. తక్షణ కర్తవ్యం ఏంటనేదానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీడీపీ నేతల చేతిలో దాడులకు గురైన వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు జగన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.