Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే..

4వతేదీ ఫలితాల తర్వాత ఏపీ మళ్లీ సుభిక్షమైన, శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు లక్ష్మీపార్వతి.

ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే..
X

ఈరోజు నందమూరి తారక రామారావు 101వ జయంతి. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, సంక్షేమ పథకాల ఆద్యుడిగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వాస్తవానికి ఈరోజు టీడీపీ నేతల హడావిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా జగన్ పేరు వినిపించడం విశేషం. సంక్షేమ సారథి ఎన్టీఆర్ ఆశీస్సులెప్పుడూ జగన్ కే ఉంటాయని అన్నారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి.

ఏపీలో మంచి సుపరిపాలన కొనసాగబోతోందని, తెలంగాణలో కూడా మంచి పరిపాలన అందించాలని ఇక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు లక్ష్మీపార్వతి. తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏపీ, తెలంగాణలో పరిపాలన కొనసాగాలన్నారు. 4వతేదీ ఫలితాల తర్వాత ఏపీ మళ్లీ సుభిక్షమైన, శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు లక్ష్మీపార్వతి.

ఎన్టీఆర్ ఘాట్ ఈరోజు సందర్శకులతో నిండిపోయింది. చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారు ఘాట్ వద్దకు రాలేకపోయారు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే తమ సందేశాలు ఉంచారు. ఇటు వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఘాట్ వద్దకు ఉదయం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వచ్చారు. లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఆయనకు నివాళి అర్పించారు.

First Published:  28 May 2024 5:50 AM GMT
Next Story