బాబు కొత్త స్కెచ్.. జగన్ వ్యతిరేకులందరూ జై భీమ్ భారత్ పార్టీలోకి!
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి, ఆ తర్వాత జగన్‌పైనా, వైసీపీపైనా నిత్యం ఆరోపణలు చేసే దస్తగిరి మొన్న జై భీమ్ భారత్ పార్టీలో చేరారు.
రాజకీయాలు మామూలుగా చేయాలంటే ఎవరైనా చేయగలరు.. కానీ వికృత రాజకీయాల్లో చేయాలంటే మాత్రం చంద్రబాబు వల్లే అవుతుంది. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఇటీవల రాష్ట్రంలో మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్ స్థాపించిన పార్టీకి బాబే బ్యాక్ బోన్ అని రాష్ట్ర రాజకీయాల్లో చాలామందికి తెలుసు. ఇప్పుడు జగన్ వ్యతిరేకులందర్నీ ఆ పార్టీలోకి పంపి, అక్కడి నుంచి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయించాలన్నది దీని వెనక ఉన్న స్కెచ్.
మొన్న దస్తగిరి.. నేడు కోడికత్తి శ్రీను
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి, ఆ తర్వాత జగన్‌పైనా, వైసీపీపైనా నిత్యం ఆరోపణలు చేసే దస్తగిరి మొన్న జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పులివెందులను నుంచి జగన్‌పై పోటీ చేస్తానని ప్రకటించేశారు. తద్వారా వివేకా హత్య కేసును జగన్ వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, అందులోనూ ఆ హత్య కేసులో నిందితుడే చెబితే ఇంకా బలంగా జనంలోకి బాగా వెళుతుందని చంద్రబాబు స్కెచ్. తాజాగా జగన్‌పై గత ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన శ్రీనుకు కూడా ఇటీవల బెయిల్ మంజూరయింది. ఆయన కూడా నిన్న్ జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.
టీడీపీలో చేరితే ఆరోపణలకు విలువ ఉండదని..
దస్తగిరి, కోడికత్తి శ్రీనులను టీడీపీలో చేర్చుకోవచ్చు. కానీ, అప్పుడు జగన్‌పై వారేం విమర్శలు చేసినా విలువ ఉండదు. అందుకే జై భీమ్ భారత్ పార్టీలో చేర్పించి, అటు నుంచి పోటీ చేయించి విమర్శలు చేయించవచ్చన్నది చంద్రబాబు ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. జడ్జి పోస్టుకు రిజైన్ చేసి, పార్టీ పెట్టిన జడ శ్రావణ్‌కుమార్‌కు పార్టీ నడపడానికి, సభలు, సమావేశాలు పెట్టడానికి చంద్రబాబే సపోర్ట్ చేస్తున్నారని విమర్శలున్నాయి. వాస్తవాలు కూడా దానికి దగ్గరగానే ఉంటున్నాయి.