పాన్ ఇండియా పాలిటిక్స్ కోసమే ఎన్టీఆర్‌తో షా భేటీ
అమిత్‍షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంటుందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
BY Telugu Global22 Aug 2022 3:56 PM IST
X
Telugu Global Updated On: 22 Aug 2022 3:56 PM IST
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఏ ఒక్క నిమిషం వెచ్చించినా అది బీజేపీ బలోపేతం కోసమే అయి ఉంటుందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. అమిత్‍షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంటుందని విశ్లేషించారు. ఏదైనా ముఖ్యమైన పనిలేకుండా మోదీ, అమిత్‍షా నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని, అటువంటిది సినిమాలో బాగా యాక్ట్ చేశావని ఎన్టీఆర్‌ని అభినందించడానికి షా వచ్చారనే మాటలు నమ్మశక్యం కానివన్నారు. దక్షిణాదితోపాటు నార్త్‌లోనూ యంగ్ టైగర్‌కి మంచి పేరు ఉందని, ఆ ఇమేజ్‌ని వాడుకుని పాన్ ఇండియా స్టార్ అయిన తారక్‌ని పాన్ ఇండియా పాలిటిక్స్‌కి బీజేపీ వాడుకునే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించవచ్చని నాని అభిప్రాయపడ్డారు.
Next Story