ముదురుతున్న ఫ్లెక్సీ వార్.. బాలయ్యపై కొడాలి ఘాటు వ్యాఖ్యలు
వెయ్యిమంది చంద్రబాబులు, వెయ్యిమంది బాలకృష్ణలు వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా బదులిచ్చారు కొడాలి నాని.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేయించిన ఫ్లెక్సీలు తొలగించాలంటూ బాలకృష్ణ చెప్పడం సంచలనంగా మారింది. ఆయన ఆదేశాలతో వెంటనే అక్కడినుంచి ఫ్లెక్సీలు తొలగించారు. ఈ వ్యవహారమంతా వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి ఫ్యామిలీ గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటు వైసీపీ కూడా ఈ వ్యవహారంపై వెంటనే స్పందించింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఎన్టీఆర్ పై సానుభూతి చూపిస్తూ మెసేజ్ లు పెడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఈ వ్యవహారంపై మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు, బాలయ్యని ఆయన చెడామడా తిట్టేశారు
వాళ్లది నీచాతినీచమైన బుద్ధి..!
— YSR Congress Party (@YSRCParty) January 18, 2024
వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ను ఏమీ చెయ్యలేరు.
లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం
-ఎమ్మెల్యే కొడాలి నాని#CBNKilledNTR#EndOfTDP pic.twitter.com/OMhJX0DDEs
వెంట్రుక కూడా పీకలేరు..
వెయ్యిమంది చంద్రబాబులు, వెయ్యిమంది బాలకృష్ణలు వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా బదులిచ్చారు కొడాలి నాని. చంద్రబాబు కోసం ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ ని బలిచేశారని, ఇప్పుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ కి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వారిది నీఛాతి నీఛమైన బుద్ధి అని అన్నారు నాని. చంద్రబాబు, బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
గుడివాడలో కూడా..
అటు కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో చంద్రబాబు బహిరంగ సభ నేపథ్యంలో వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా రాజకీయ కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు బ్యానర్లలో పవన్ కల్యాణ్ కి చోటిచ్చారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా కొడాలి నాని అభిమానులు వేసిన బ్యానర్లలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు ఉన్నాయి. మొత్తమ్మీద ఏపీ ఎన్నికల నాటికి వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన అస్త్రంగా పనికొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు జరిగిన ఫ్లెక్సీ వివాదంపై ఇటు టీడీపీకానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకా స్పందించలేదు.