Telugu Global
Andhra Pradesh

టీడీపీకి మరో షాక్‌.. – రాజీనామా చేయనున్న కేశినేని శ్వేత

సోమవారం ఉదయం 10.30 గంటలకు తన కుమార్తె శ్వేత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో తన రాజీనామా అందజేయనున్నట్టు నాని తన ట్వీట్‌లో తెలిపారు.

టీడీపీకి మరో షాక్‌.. – రాజీనామా చేయనున్న కేశినేని శ్వేత
X

టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి పార్టీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె, విజయవాడ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత కూడా గుడ్‌బై చెప్పనున్నారు. ఆ విషయాన్ని కేశినేని నాని వెల్లడించారు. శ్వేత తన కార్పొరేటర్‌ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ విషయాన్ని ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. కేశినేని శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తన కుమార్తె శ్వేత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో తన రాజీనామా అందజేయనున్నట్టు నాని తన ట్వీట్‌లో తెలిపారు. కార్పొరేటర్‌ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుందని స్పష్టంచేశారు.

తన రాజీనామాపై మరోసారి క్లారిటీ..

మరోపక్క తన రాజీనామాపై కేశినేని నాని ఆదివారం కూడా స్పందించారు. రాజీనామా చేస్తామని చెప్పాక కచ్చితంగా చేస్తానని స్పష్టంచేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతోందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టంచేశారు. దీనిని బట్టి ఎంపీ కేశినేని నాని పూర్తిగా టీడీపీ నుంచి వెళ్లిపోవటానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.

First Published:  8 Jan 2024 9:30 AM IST
Next Story