Telugu Global
Andhra Pradesh

టీడీపీలో వసంత కలకలం.. కేశినేని నాని వ్యాఖ్యల దుమారం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ కేశినేని నాని. కొండపల్లి మున్సిపాల్టీ ఛైర్మన్‌ ఎన్నికకు టీడీపీయే అడ్డంకి అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ అనడంలో అర్థం లేదన్నారు.

టీడీపీలో వసంత కలకలం.. కేశినేని నాని వ్యాఖ్యల దుమారం
X

ఇటీవల వైసీపీలో బయటపడుతున్న అసంతృప్త, అసమ్మతి స్వరాలు.. టీడీపీని కూడా ఇరకాటంలో పెడుతున్నాయి. పొత్తుల ఎత్తుల్లో తాము చిత్తవుతామేమోనని ముందుగానే కొంతమంది భయపడుతున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు టీడీపీ సిట్టింగ్ ల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విజయవాడ ఎంపీ నాని కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు, అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఎదుటే తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే విజయవాడలో నానికి ధీటుగా రాజకీయాలు చేసేవారు, డబ్బు ఖర్చు చేసేవారు టీడీపీకి ఎవరూ దొరకడంలేదు. అందుకే నాని సోదరుడిని, చంద్రబాబు ప్రోత్సహిస్తున్నా.. ఆచితూచి అడుగులేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ కేశినేని నాని. కొండపల్లి మున్సిపాల్టీ ఛైర్మన్‌ ఎన్నికకు టీడీపీయే అడ్డంకి అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ అనడంలో అర్థం లేదన్నారు. ముందు ఆయన ఏ పార్టీనో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇటీవల కేశినేని నానిని, వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కలిశారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కాయి. ఈ చర్చల తర్వాత కూడా వసంత కృష్ణప్రసాద్ పై నాని కౌంటర్లు వేయడం మరో విశేషం. వీరసింహారెడ్డి రిలీజ్ సందర్భంగా బాలయ్య పక్కన కృష్ణ ప్రసాద్ పోస్టర్లు కనపడ్డం కూడా టీడీపీ నేతల కలవరపాటుకి కారణం అవుతోంది. వసంత టీడీపీలోకి వస్తే ఎవరి సీటుకి ఎసరు ఉంటుందోననే ఆందోళన అందరిలో ఉంది.

సామంతరాజులెవరూ లేరు..

టీడీపీలో సామంత రాజులమని గర్వించే వారు ఎవరైనా కృష్ణానదిలో కలవాల్సిందేనని అన్నారు ఎంపీ కేశినేని నాని. రాబోయే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీలో సీనియర్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. రోజురోజుకు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా యువతను ప్రోత్సహించి, వారికి అవకాశం ఇవ్వాలన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్థులెవరైనా కలిసికట్టుగా పార్టీలో పని చేయాలన్నారు నాని. రెండు సార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనే ట్యాగ్ లైన్లు ఇక పనికి రావన్నారు. తమ ప్రాంతానికి తామే సామంత రాజులమని ఏ ఒక్కరూ గర్వపడకూడదని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు అందరూ కలిసి పని చేస్తేనే జగన్‌ పాలన అంతం చేయొచ్చని చెప్పారు.

First Published:  13 Jan 2023 10:06 AM IST
Next Story