పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం.. ముద్రగడ అంచనా..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తనను కష్టాల పాలు చేశారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, మరోసారి ఆయనకు ఓటమి తప్పదని ఆయన అన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పరాజయం పాలవుతారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాను టీడీపీ, జనసేనల ఓటమికి పనిచేస్తానని ముద్రగడ చెప్పారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తనను కష్టాల పాలు చేశారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, మరోసారి ఆయనకు ఓటమి తప్పదని ఆయన అన్నారు. కాపు సామాజికవర్గం సంక్షేమం కోసమే కాకుండా ప్రజల మేలు కోసం తాను పాటుపడినట్లు ఆయన తెలిపారు.
తీవ్రంగా నష్టపోయినప్పటికీ తాను ఉద్యమాలు చేశానని, కాపు సమాజం కోసమే కాకుండా ప్రజల కోసం పవన్ కల్యాణ్ అటువంటి ఉద్యమాలు చేయాలని ఆయన అన్నారు. జనసేన కేవలం 20 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తోందని, అందువల్ల తాను పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ పేద, అణగారిన వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఆయన 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని ముద్రగడ అన్నారు.