కాపులకు నువ్వేం చేశావ్ పవన్? – కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు
కాపులకు నువ్వేం చేశావ్ పవన్ అంటూ అడపా శేషు నిలదీశారు. ఒక్క కాపునైనా నువ్వు ఎమ్మెల్యేగా చేశావా అంటూ ప్రశ్నించారు. జనసేన పెట్టింది.. చంద్రబాబు కోసమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కోసం పనిచేసే కాపు నాయకుడిలా పవన్ మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. కాపుల హక్కుల కోసం పవన్ ఏనాడైనా పోరాటం చేశాడా అని నిలదీశారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసినపుడు పవన్ ఎక్కిడికి వెళ్లాడని ఆయన ప్రశ్నించారు. ఈబీసీ రిజర్వేషన్ల గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాపులకు నువ్వేం చేశావ్ పవన్ అంటూ అడపా శేషు నిలదీశారు. ఒక్క కాపునైనా నువ్వు ఎమ్మెల్యేగా చేశావా అంటూ ప్రశ్నించారు. జనసేన పెట్టింది.. చంద్రబాబు కోసమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అంటేనే మోసం.. మా కాపులు పవన్‌ను నమ్మి మోసపోయారు.. అంటూ విమర్శించారు. కాపులకు కాపు కాస్తున్న ఒకే ఒక్క వ్యక్తి సీఎం జగన్ అని అడపా శేషు చెప్పారు. ఈబీసీ నేస్తం ద్వారా కాపులకు మేలు చేసిన వ్యక్తి జగన్ అని తెలిపారు. 30 మంది కాపులను జగన్ ఎమ్మెల్యేలను చేశారని గుర్తుచేశారు. అంతేకాదు.. ఐదుగురు కాపులను మంత్రులను చేశారని ఆయన చెప్పారు. జగన్ అంటే నమ్మకం, విశ్వాసమని ఆయన స్పష్టం చేశారు. జనసేనలో మోసపోయిన వారంతా ఇప్పుడు సీఎం జగన్ వద్దకు చేరుతున్నారని ఆయన చెప్పారు. చిరంజీవిని మోసం చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, చిరంజీవిని ఎవరూ మోసం చేయలేదని ఆయన తెలిపారు.