కత్తులు దూస్తున్న కోస్తా కాపులు
అసంతృప్తితో, ఆవేదనతో రగిలిపోతున్న పవర్ ఫుల్ కోస్తా కాపువర్గం లాగానే, బీజేపీ కూడా పట్టుసడలకుండా నిలబడి ఉంది. జనసేన, టీడీపీ పొత్తు కుదిరి, సీట్లు ప్రకటించి నాలుగు రోజులవుతున్నా బీజేపీ కేంద్ర నాయకత్వం నోరు మెదపలేదు.
చంద్రబాబుకి ఆధారం అయినా, ఆక్సిజన్ అయినా పవన్ కళ్యాణ్ ఒక్కడే. బాబు పక్కన పవర్‌స్టార్ స్థిరంగా నిలబడితేనే, కమ్మరాజ్యానికి కాపు ప్రాణవాయువు అందుతుంది. ఇది తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్‌కీ తెలుసు. పవన్ మీద విమర్శలు గుప్పిస్తున్న మేడిశెట్టికీ తెలుసు. తెలిస్తే ఏమౌతుంది..? అనే కదా ప్రశ్న..!
ఇదంతా తెలిసి ఉండి 24 సీట్లకే ఒప్పుకోవడం ఏమిటి వెర్రి నాగన్నా అంటున్నారు. చేగొండి హరిరామ జోగయ్య మొదటి నుంచీ మొత్తుకుంటున్నదీ ఇదే..! మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 24 మాత్రమే ఇస్తే, వాటిలో పదో, పదిహేనో గెలిస్తే, ‘‘మాకు ముఖ్యమంత్రి ఇవ్వండి’’ అని ఎలా అడగ్గలం..? చంద్రబాబు పల్లకీ మోయడానికి సరిపడినంత మంది వాళ్లు గెలిస్తే, పల్లకీ మేం ఎక్కుతాం, మీరే మోయండి అని కమ్మ ప్రభువుల్ని నిలదీసి అడగగలరా..? అసాధ్యం కదా..!
అసంతృప్తితో, ఆవేదనతో రగిలిపోతున్న పవర్ ఫుల్ కోస్తా కాపువర్గం లాగానే, బీజేపీ కూడా పట్టుసడలకుండా నిలబడి ఉంది. జనసేన, టీడీపీ పొత్తు కుదిరి, సీట్లు ప్రకటించి నాలుగు రోజులవుతున్నా బీజేపీ కేంద్ర నాయకత్వం నోరు మెదపలేదు. ఆంధ్రా బీజేపీ నాయకురాలు పురందేశ్వరి కిమ్మనడం లేదు. ఇది చాలా స్పష్టమైన సూచన. పొత్తులూ, కలిసి పోటీలూ అంటూ చంద్రబాబుతో లాలూచీపడే బదులు, కేంద్రంలో సర్వశక్తి సంపన్నమైన బీజేపీతో కలిసి ఉంటే కాపులకు జరిగే మేలు ఎక్కువ కదా అని కులాభిమానులు అనుకుంటున్నారు. చంద్రబాబు అంటే గిట్టని బీజేపీని కూడా కూటమిలోకి లాగడానికి పవన్ తీవ్రంగా ప్రయత్నించడం అంటే బాబు ఏజెంట్‌గా బిహేవ్ చేయడమే కదా..! అంత ఖర్మ కాపులకు ఎందుకు..? అనేది ఒక న్యాయమైన వాదన. ఇచ్చిన 24 సీట్లలో జనసేనకి బలం ఉన్నవి చాలా తక్కువేనని అభిమానులు ఉదాహరణలతో సహా చెబుతున్నారు.
కాపులు ఏమైపోతేనేం..? పవన్ ఏమీ కాకుండా పోతేనేం..? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే నాకేం..? రాకపోతే నాకేం..? నేను మరోసారి ముఖ్యమంత్రి అయిపోతే అదేచాలు అనేది చంద్రబాబు యాటిట్యూడ్. ఈసారన్నా చక్రం తిప్పాలన్న ఉబలాటంతో ఊగిపోతున్నాడు బాబు. ఇటు చూస్తే, చంద్రబాబునీ, నాదెండ్ల మనోహర్‌నీ అనందపరిచి, నమ్ముకున్న కాపులకు విషాదం మిగిల్చేలాగా పవర్ స్టార్ ప్రవర్తన ఉంది. పవన్ యవ్వారం బీజేపీకీ నచ్చక, పెద్ద సంఖ్యలో ఉన్న కాపు జన శ్రేణులకీ నచ్చకపోతే.. చివరికి అది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అయాచితవరంగా మారుతుందని చెప్పడం మినిమం కామన్‌సెన్స్ అవుతుంది. లక్షలాది కాపుల ఆశలపై చీకటి తెరలు దించుతున్న వెండితెర హీరో, అధికార దాహం అనే బాబు తాపత్రయం కిందపడి విలవిల్లాడుతున్నాడు, అటు కోస్తాలో పదునైన కత్తులై మెరుస్తున్న కాపులు చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచినా ఆశ్చర్యం లేదు.