Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి కాపుల సూటిప్రశ్న

కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనకబడిన) 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం సబ్‌ కోటా అని చంద్రబాబు మెలిక పెట్టి, కొత్త గొడవని తెచ్చి పెట్టారు.

చంద్రబాబుకి కాపుల సూటిప్రశ్న
X

కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తానని 2014లోనే హామీ ఇచ్చి మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దీనిని అమలు చేస్తానని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పారు.

కాపుల వాస్తవ సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలిసినప్పటికీ చంద్రబాబు ఓటు బ్యాంక్‌ అనే రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు. కాపు ఉద్యమ ఫలితంగా 1994లో ఇచ్చిన జీవో నంబర్‌ 30 ద్వారా కాపులకు బీసీ రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సమర్థించింది. ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఆ జీవోని అసలు పట్టించుకోలేదు. కాపులకు జరిగిన అన్యాయాలపై బాబు ఏనాడూ స్పందించలేదు. బీసీలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్‌లలో మాదిరిగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నా మీరాపని చేయలేదు. 2014లో మేనిఫెస్టోలో ఈ అంశం పెట్టి మరీ మోసం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనకబడిన) 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం సబ్‌ కోటా అని చంద్రబాబు మెలిక పెట్టి, కొత్త గొడవని తెచ్చి పెట్టారు. దీంతో రాష్ట్రంలో కాపులు బీసీలా, ఓసీలా..? తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఏదీ చేయకుండా చేతులు దులుపుకొని ఫైలు ఢిల్లీ పంపేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా వల్ల కాపులకు నష్టం. రిజర్వేషన్ల విషయంలో నాటకాలు ఆడి, అప్పుడో మాట, ఇప్పుడో మాట చెప్పి చంద్రబాబు గేమ్‌ ఆడుతున్నారు. ఒట్టి మాటలు మాత్రమే చెప్పి చంద్రబాబు ఓట్లు రాబట్టుకునే అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఇదీ కాపు నాయకుల అభిప్రాయం.

ఈ విమర్శలో నిజం ఉంది. చంద్రబాబు రాజకీయ భజన బృందంలో చేరి, కాపుల కోసం గొంతెత్తి మాట్లాడుతున్న జనసేన పవన్‌కల్యాణ్‌కి ఈ చిన్న విషయం తెలీదా..? ఒకవేళ మళ్లీ చంద్రబాబు సీఎం అయితే కాపులకు వొరిగేదేమిటి..? పవన్‌ కల్యాణ్‌ అనే రాజకీయ నటునికి చివరికి మిగిలిలేదేమిటి..? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న కవి మాటలు గుర్తున్నాయా..?

First Published:  29 Jan 2024 8:50 AM IST
Next Story