కలియుగ శల్యుడు పవన్ కళ్యాణ్.. పేర్ని నాని పంచులు
అన్నా నువ్వే సీఎం అని ప్రతి మీటింగ్‌లోనూ జేజేలు కొట్టే మీ జనసైనికులకు ఏమని సమాధానం చెబుతావ్? మనం ఉన్నది పల్లకిలో కూర్చోవడానికి కాదు.. చంద్రబాబు కూర్చున్న పల్లకీ మోయడానికి అని చెబుతావా?
మహాభారతంలో కర్ణుడికి రథ సారథిగా ఉండటం ఇష్టం లేని శల్యుడు ఆయన రథం తోలుతూనే ఎప్పుడూ అతణ్ని నిరాశపరుస్తూ, కించపరుస్తూ ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తూ ఉంటాడు. అందుకే నాయకుడే తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు దాన్ని శల్యసారథ్యం అంటుంటారు. ఇప్పడు అలాంటి శల్యుడు మన పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సొంత పార్టీని అధికారంలోకి రానివ్వకుండా, జనసేన కార్యకర్తలను నిరాశ పరుస్తున్న కలియుగ శల్యుడు పవన్ అని నాని కామెంట్ చేశారు.
అన్నా నువ్వే సీఎం అనే జనసైనికులకు ఏం చెబుతావ్?
అన్నా నువ్వే సీఎం అని ప్రతి మీటింగ్‌లోనూ జేజేలు కొట్టే మీ జనసైనికులకు ఏమని సమాధానం చెబుతావ్? మనం ఉన్నది పల్లకిలో కూర్చోవడానికి కాదు.. చంద్రబాబు కూర్చున్న పల్లకీ మోయడానికి అని చెబుతావా? మన చేతుల్లో ఆయుధాలు ఉండకూడదు రా.. తెలుగుదేశాన్ని అధికార పల్లకిలో కూర్చోబెట్టి దాని కమ్మీ పట్టుకుని మోయాలి అని చెబుతావా..? అని పేర్ని నాని విమర్శలు కురిపించారు.
కలియుగంలోనూ శల్యుడున్నాడని చూపిస్తున్నావు
`శల్యుడనేవాడు ఉండేవాడు.. అని మహాభారతంలో చదివాం. కానీ, పవన్ కల్యాణ్ కలియుగంలో కూడా అలాంటి శల్యుడు ఉన్నాడని, అది నువ్వేనని నిరూపిస్తున్నావ్ అంటూ పవన్‌పై పేర్ని పంచులు వేశారు. సొంత పార్టీని బలిపెట్టి టీడీపీని, చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్న నువ్వు నిజంగా కలియుగ శల్యుడివే` అని పేర్ని కామెంట్ చేశారు.