Telugu Global
Andhra Pradesh

పోలీసులకు కీలక సమాచారమిచ్చిన కాదంబరి

ఎంక్వయిరీ దాదాపు 4 గంటలసేపు సాగింది. తనకు న్యాయం చేయాలని ఏసీపీ స్రవంతి రాయ్ ని, సీపీ రాజశేఖర్ బాబుని కోరారు కాదంబరి.

పోలీసులకు కీలక సమాచారమిచ్చిన కాదంబరి
X

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ, ఆమె తల్లి ఆశా జత్వానీ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని కలశారు. తనపై తప్పడు కేసులు పెట్టి కొంతమంది వేధించారన్నారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ఆమె కమిషనర్ కి చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత ఈ కేసు విచారణ అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ ని కూడా ఆమె కలిశారు. కంప్లయింట్ కాపీని ఆయనకు ఇచ్చారు. తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను కూడా అందజేశారు. ఈ ఎంక్వయిరీ దాదాపు 4 గంటలసేపు సాగింది. తనకు న్యాయం చేయాలని కాదంబరి ఏసీపీ స్రవంతి రాయ్ ని కోరారు.

కాదంబరి పెద్ద బ్లాక్ మెయిలర్ అని, ఆమె రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేవారని వైసీపీ అనుకూల మీడియా చెబుతోంది. మరోవైపు టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం కాదంబరి వ్యవహారాన్ని బాగా హైలైట్ చేస్తోంది. వైసీపీని టార్గెట్ చేయాలని చూస్తోంది. కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కోసం కాదంబరిని పోలీసులు టార్గెట్ చేశారని, ఆమె కుటుంబాన్ని హింసించారని, తప్పుడు కేసులు పెట్టి వేధించారని అంటున్నారు. దీనిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.

మరో ట్విస్ట్..

కాదంబరి, కుక్కల విద్యాసాగర్ వ్యవహారంలో పోలీసులు ఆమెను బెదిరించేందుకు అక్రమ కేసు బనాయించారనేది ప్రధాన ఆరోపణ. జగ్గయ్యపేటలోని ఐదెకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించి అమ్మేందుకు ప్రయత్నించారని కాదంబరిపై కేసు పెట్టి అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో కీలక సాక్షులుగా ఉన్న ఇద్దరు ఇప్పుడు రివర్స్ అయ్యారు. కుక్కల విద్యాసాగర్ తమ ఆధార్ కార్డ్ లను దుర్వినియోగం చేశారని, తప్పుడు కేసులో తమను సాక్షులుగా చేర్చారని అంటున్నారు. కుక్కల విద్యాసాగర్, ఆయన తండ్రి కుక్కల నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

ఎక్కడో ముంబైలో ఉన్న హీరోయిన్ జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మాలనుకోవడం సాధ్యమా..? అది కూడా రాజకీయ నాయకులకు చెందిన భూమిని ఆమె అంత ఈజీగా అమ్మేస్తారా..? ఆమెకు అడ్వాన్స్ ఇచ్చినవాళ్లు కూడా రాజకీయ నాయకులే కావడం ఇక్కడ మరో విశేషం. ఈ వ్యవహారమంతా వింటే ఇది కచ్చితంగా కట్టుకథ అని అర్థమవుతుందని టీడీపీ నేతలంటున్నారు. వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.

First Published:  31 Aug 2024 6:33 AM IST
Next Story