చంద్రబాబు సభలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు
కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అంటూ నినాదాలు చేస్తున్నారు. చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా పలుమార్లు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు.

ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదిలి రా ' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్ చల్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు ప్రదర్శిస్తూ..సీఎం.. సీఎం అని నినాదాలు చేయడం కలకలం రేపింది. కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించినా ఆ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హాజరై ఆయన ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.
అంతటితో ఆగకుండా కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అంటూ నినాదాలు చేస్తున్నారు. చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా పలుమార్లు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా పలుచోట్ల జూ.ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ.. అభిమానులు బ్యానర్లు ప్రదర్శించారు.
ఇవాళ చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన సభలో కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బ్యానర్లు, జెండాలు కనిపించాయి. అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ సీఎం.. అంటూ జెండాలపై రాశారు. ఈ జెండాలను టీడీపీ నాయకులు లాక్కొని పక్కన పడేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నాయకుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.