Telugu Global
Andhra Pradesh

మూడ్ ఆఫ్ ఏపీ.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌క‌ల్లా తేలిపోతుంది!

లెక్కింపు మొత్తం పూర్తి చేసి, రాత్రి 9 గంట‌ల‌క‌ల్లా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఫలితాలు ప్ర‌క‌టిస్తామ‌ని సీఈవో ముకేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చెందిన సీనియ‌ర్ డిప్యూటీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నితీష్ వ్యాస్‌కు నివేదించారు.

మూడ్ ఆఫ్ ఏపీ.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌క‌ల్లా తేలిపోతుంది!
X

ఏపీలో కురుక్షేత్ర సంగ్రామంలా సాగిన సార్వ‌త్రిక పోరు ఫ‌లితాలకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. జూన్ 4న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. 60 శాతానికి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే ఫ‌లితాలు తేలిపోనున్నాయి. దీంతో ఏపీలో అధికారం చేప‌ట్ట‌బోయేది ఎవ‌ర‌న్న‌ది.. 4వ‌ తేదీ మ‌ధ్యాహ్నం క‌ల్లా డిసైడ్ అయిపోతుంది.

111 నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 లోపే రౌండ్లు

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 111 నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 రౌండ్ల లోపే కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల్లోపే వీటి ఫ‌లితాలు వెల్ల‌డయిపోతాయి. నందిగామ లాంటి త‌క్కువ ఓట‌ర్లు, త‌క్కువ మంది అభ్య‌ర్థులున్న స్థానాల్లో 12, ఒంటి గంట‌లోపే ఫ‌లితాలు రానున్నాయి.

61 నియోజ‌క‌వ‌ర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు

మ‌రో 61 నియోజ‌క‌వ‌ర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల‌లోపు ఫ‌లితం రానుంది. వీటిలో ఫలితాలు వ‌చ్చేస‌రికి సాయంత్రం 4 గంట‌లు కావొచ్చు. మ‌రో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం 25 కంటే ఎక్కువ రౌండ్ల‌లో కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. అత్య‌ధిక మంది ఓట‌ర్లున్న భీమిలి వంటి చోట్ల రాత్రి 7 లేదా 8 గంట‌ల‌కు ఫ‌లితాలు వెలువ‌డుతాయి.

రాత్రి 9 గంట‌ల‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న‌

లెక్కింపు మొత్తం పూర్తి చేసి, రాత్రి 9 గంట‌ల‌క‌ల్లా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఫలితాలు ప్ర‌క‌టిస్తామ‌ని సీఈవో ముకేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చెందిన సీనియ‌ర్ డిప్యూటీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నితీష్ వ్యాస్‌కు నివేదించారు.

First Published:  30 May 2024 6:41 AM GMT
Next Story