Telugu Global
Andhra Pradesh

మూటలు తీసుకుని బెయిలిచ్చారా?

డిబేట్లో రామకృష్ణ మాట్లాడుతూ.. అవినాష్ దగ్గర మూటలు తీసుకునే జడ్జి తాత్కాలిక బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. బెయిల్ అప్లికేషన్లోలోని రిలీఫ్ ఇచ్చారంటేనే ఏ జడ్జియినా మూటలు తీసుకునే బెయిల్ ఇచ్చారని తాను కచ్చితంగా చెప్పగలనని రామకృష్ణ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

మూటలు తీసుకుని బెయిలిచ్చారా?
X

వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు తాత్కాలికంగా బెయిల్ ఇవ్వటాన్ని ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి అంటేనే బాగా కసితో రగిలిపోయే వాళ్ళను తమ ఛానళ్ళకు పిలిపించి ఒకటికి వంద సార్లు బురదచల్లిస్తుంటుంది. ఇందులో భాగంగానే శనివారం తమ ఛానల్లో జరిగిన డిబేట్లో సస్పెండ్ అయి, కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద జడ్జి రామకృష్ణ హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు.

డిబేట్లో రామకృష్ణ మాట్లాడుతూ.. అవినాష్ దగ్గర మూటలు తీసుకునే జడ్జి తాత్కాలిక బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. బెయిల్ అప్లికేషన్లోలోని రిలీఫ్ ఇచ్చారంటేనే ఏ జడ్జియినా మూటలు తీసుకునే బెయిల్ ఇచ్చారని తాను కచ్చితంగా చెప్పగలనని రామకృష్ణ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ‘ఎంపీ తల్లి అనారోగ్యంతో ఉన్నారట..ఆమెకు ఆపరేషన్ చేయాలట..అందుకని ఎంపీకి బెయిల్ కావాలట..దానికి జడ్జి ఆమోదించారట.’ అని రామకృష్ణ చాలా వెటకారంగా మాట్లాడారు.

ఏదేమైనా డబ్బులు తీసుకునే జడ్జి ఎంపీకి తాత్కాలిక బెయిల్ ఇచ్చారన్న విషయాన్ని రామకృష్ణ తేల్చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ్ముళ్ళు డైరెక్టుగా లేదా పరోక్షంగా ఇతరులతో పదుల సంఖ్యలో కేసులు వేయించారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం కూడా తీసుకున్న నిర్ణయం తీసుకున్నట్లు అమలు కాకుండా అడ్డుపడుతునే ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి న్యాయస్థానంలో కేసులు వేయటం స్టేలు తీసుకురావటమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.

హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ఒక బెంచ్‌లో ఓడిపోతే మరో బెంచ్‌కు ఇలా ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెడుతునే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే వచ్చినా, తీర్పొచ్చినా న్యాయం గెలిచిందని సంబరాలు చేసుకుంటారు. అదే వేసిన కేసును కొట్టేస్తే ప్రభుత్వం మ్యానేజ్ చేసుకున్నదని బురదచల్లేస్తారు. ఇప్పుడు అవినాష్‌కు తాత్కాలిక బెయిల్ ఇవ్వటంపై టీడీపీ, ఎల్లో మీడియా ఎంతగా మండిపోతోందో అర్థ‌మైపోతోంది. వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే అవినాష్‌ను వెంటనే అరెస్టు చేయమని హైకోర్టు ఆదేశిస్తుందని. అయితే అందుకు భిన్నంగా జరిగి తాత్కాలిక బెయిల్ మంజూరు చేయటాన్నే తట్టుకోలేకపోతున్నారు. అందుకనే మూటలు తీసుకుని బెయిలిచ్చారు జడ్జి అని ఆరోపణలు చేసేంత దుస్సాహసానికి తెగబడ్డారు.

First Published:  28 May 2023 6:08 AM GMT
Next Story