Telugu Global
Andhra Pradesh

ప్రియమైన మావయ్యకు.. జూ.ఎన్టీఆర్‌ ట్వీట్ వైరల్‌

అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌, హ్యాట్రిక్ విజయం సాధించిన బాలకృష్ణతో పాటు ఎంపీలుగా గెలిచిన భరత్‌రామ్‌, అత్త పురందేశ్వరిని ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రియమైన మావయ్యకు.. జూ.ఎన్టీఆర్‌ ట్వీట్ వైరల్‌
X

ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం సాధించడంపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌, భరత్‌ రామ్‌, బాలకృష్ణ, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సైతం ప్రత్యేకంగా అభినందించారు జూనియర్.

ఇంతకీ జూనియర్ ఏం ట్వీట్ చేశారంటే..!

చారిత్రాత్మకమైన విజయం సాధించిన చంద్రబాబు మావయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌, హ్యాట్రిక్ విజయం సాధించిన బాలకృష్ణతో పాటు ఎంపీలుగా గెలిచిన భరత్‌రామ్‌, అత్త పురందేశ్వరిని ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నిన్న గెలిస్తే ఇవాళ ట్వీట్ చేయడం ఏంటని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌కు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

First Published:  5 Jun 2024 12:11 PM GMT
Next Story