Telugu Global
Andhra Pradesh

రామోజీతో నడ్డా.. ఈ ఎలివేషన్ సరిపోతుందా..?

రామోజీని నడ్డా కలవడాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోడానికి ఎల్లో గ్యాంగ్ తంటాలు పడుతుంటే.. మరోవైపు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. సీఐడీ అధికారులు వచ్చినప్పుడు రామోజీ మంచంపై పడుకున్న ఫొటోల్ని షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

రామోజీతో నడ్డా.. ఈ ఎలివేషన్ సరిపోతుందా..?
X

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇది అసలు కార్యక్రమం. అయితే ఈ సందర్భంగా ఆయన రామోజీ ఫిలింసిటీకి వెళ్లి రామోజీరావుని కూడా కలిసి వచ్చారు. ఇది కొసరు కార్యక్రమం. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడీ కొసరు కార్యక్రమమే హైలైట్ అవుతోంది. రామోజీని తాను కలసిన ఫొటోల్ని స్వయంగా నడ్డానే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఎల్లో బ్యాచ్ తెగ హడావిడి చేస్తోంది.


ఎందుకీ ఎలివేషన్లు..?

చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్నారు. దానికి కారణం జగన్ తోపాటు, బీజేపీ కూడా అనే ప్రచారం ఉంది. ఈ దశలో చంద్రబాబు తరపున రామోజీ రాయబారం నడుపుతున్నారని అర్థం వచ్చేలా ఈ ఫొటోలతో ఎల్లో గ్యాంగ్ చెలరేగిపోతోంది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా ఖాయమని అంటున్నారు. ఏపీలో కూటమికి తిరుగులేదని, రామోజీ దగ్గర వ్యవహారం అంతా ఫిక్స్ అయిపోయిందని చెబుతున్నారు. టీడీపీ ట్విట్టర్ హ్యాండిళ్ల హడావిడి చూస్తుంటే.. ఏపీలో ఎన్నికలు అయిపోయి చంద్రబాబు సీఎం పదవి చేపట్టినట్టుగా కనపడుతోంది.





రామోజీపై ట్రోలింగ్..

రామోజీని నడ్డా కలవడాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోడానికి ఎల్లో గ్యాంగ్ తంటాలు పడుతుంటే.. మరోవైపు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. సీఐడీ అధికారులు వచ్చినప్పుడు రామోజీ మంచంపై పడుకున్న ఫొటోల్ని షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సీఐడీ వచ్చినప్పుడు అలా, ఇతరులు వచ్చినప్పుడు ఇలా.. అంటూ ఆ రెండు ఫొటోల్ని కంపేర్ చేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. ఆ ఎలివేషన్లు, ఈ సెటైర్లతో.. రామోజీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

First Published:  7 Oct 2023 10:15 AM IST
Next Story