Telugu Global
Andhra Pradesh

టైటిల్ ‘మహా స్వాప్నికుడు’ సరిగ్గా సరిపోయింది

పరిపాలనలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులను పుస్తకంలో ప్రస్తావించినట్లు రచయిత చెప్పాడు. చంద్రబాబు ఏమి సంస్కరణలు ప్రవేశపెట్టారో అర్థంకావటంలేదు.

టైటిల్ ‘మహా స్వాప్నికుడు’ సరిగ్గా సరిపోయింది
X

చంద్రబాబునాయుడు గురించి సీనియర్ పాత్రికేయుడు విక్రమ్ రాసిన పుస్తకం విడుదలైంది. దానిపేరు ఏమిటంటే ‘మహా స్నాపికుడు’. పుస్తకం టైటిల్ చూడగానే అందరికీ అర్థ‌మైపోతోంది చంద్రబాబు గురించి ఏ యాంగిల్లో రచయిత రాసుంటారో అని. పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడిన విక్ర‌మ్‌, చంద్రబాబులోని ఔన్నత్యం గురించి ప్రస్తావించారట. చంద్రబాబులోని ఔన్నత్యాన్ని, చాణుక్యాన్ని, దార్శనికతను ఆయన భక్తులు తప్ప మరొకళ్ళు గుర్తించలేరు. ఎందుకంటే.. చంద్రబాబు పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఎన్టీఆర్‌కు వెన్నుపోటే.

తర్వాత గుర్తుకొచ్చేది కుట్రలు, అవకాశవాద రాజకీయాలు, పొత్తుల పేరుతో నీచరాజకీయాలు చేయటం, అవసరార్థం ఎంతకైనా దిగజారే మనస్తత్వం, అవసరానికి వాడుకుని వదిలేయటం లాంటి అనేక లక్షణాలు గుర్తుకువస్తాయి. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు తనను తాను చాణుక్యుడిగా ఎంతలా ప్రొజెక్టు చేసుకున్నారో అందరికీ తెలిసిందే. మామూలు జనాలకు ఇలాంటి లక్షణాలే కనబడుతున్నప్పుడు చంద్రబాబులోని ఔన్నత్యం, దార్శనికత, చాణుక్యాన్ని చూడగలిగారంటే రచయిత కచ్చితంగా భక్తుడే అయ్యుంటారనటంలో సందేహమే లేదు.

పరిపాలనలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులను పుస్తకంలో ప్రస్తావించినట్లు రచయిత చెప్పాడు. చంద్రబాబు ఏమి సంస్కరణలు ప్రవేశపెట్టారో అర్థంకావటంలేదు. మాటకొస్తే డ్వాక్రా గ్రూపులను తీసుకొచ్చింది తానే అంటారు. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు అంటే 1993లోనే పీవీ నరసింహారావు డ్వాక్రా వ్యవస్థ‌ను ప్రవేశపెట్టారు. దేశంలో సెల్ ఫోన్ తీసుకొచ్చింది తానే అంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకమునుపు 1994లో మొబైల్ ఫోన్ ద్వారా కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సుఖరామ్- పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుతో మాట్లాడారు. దేశంలో ఐటీ విప్లవం తన వల్లే వచ్చిందంటారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడాను ఇండియాకు రప్పించి ఐటీ విప్లవానికి నాంది పలికారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికే చెన్నై, బెంగళూరు ఐటీ రంగంలో మంచి జోరుమీదున్నాయి. హైటెక్ సిటీని తానే తెచ్చానని చెప్పటం కూడా అబద్ధమే. 1992లో నేదురమల్లి జనార్ద‌న్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ పార్క్ కు శంకుస్థాపన జరిగింది. ఇక హైదరాబాద్ లో ఫార్మారంగం 1980 నాటికే ఉంది. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు భ్రమల్లో ఉండటమే కాకుండా జనాలందరినీ భ్రమల్లో ముంచేయటం వాస్తవం. ప్రపంచస్థాయి రాజధాని కట్టాలన్నది ఒక్కటే చంద్రబాబు స్వప్నం. చివరకు ఆ స్వప్నం స్వప్నంగానే మిగిలిపోయింది. చంద్రబాబు గురించి అనేక అబద్ధాలను ప్రచారం చేశారని రచయిత చెప్పటమే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తానెంతటి భక్తుడో అర్థ‌మైపోతోంది. అంతటి భక్తుడు అయ్యుంటేతప్ప చంద్రబాబు గురించి ఇలా రాయలేరు.

First Published:  12 Feb 2024 6:31 AM GMT
Next Story